ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిన లిక్కర్ స్కాం కేసు (Liquor Scam Case) తాజాగా కొత్త మలుపు తిరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ (YCP) హయాంలో భారీ స్థాయిలో మద్యం కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. ఈ కేసును సిట్ (Special Investigation Team) లోతుగా విచారిస్తోంది. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలకు నోటీసులు జారీ కాగా, ముఖ్యంగా విజయసాయి రెడ్డి (Vijayasai Reddy)సాక్షిగా సిట్ విచారణకు హాజరవుతుండటంతో రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.
Gold Rates Rising: భారతదేశంలో బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
విజయసాయి ఇప్పటికే తనను విచారిస్తే మరిన్ని నిజాలు బయటపెడతానని ప్రకటించగా, ఆయన అందించే సమాచారం ఈ కేసులో కీలక మలుపు తిప్పొచ్చని అంచనాలు ఉన్నాయి. గతంలో సాయిరెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యల్లో “కర్మ, కర్త, క్రియ అన్నీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి” అన్నారు. ఇప్పుడు సిట్ దర్యాప్తులోనూ అదే దిశగా పురోగతి నమోదవుతోందని సమాచారం. కసిరెడ్డి గత ఐదేళ్లలో మద్యం వ్యాపారాల ద్వారా భారీగా అక్రమ ఆస్తులు సంపాదించారని, ఆ డబ్బుతో సినిమాలు నిర్మించి, సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా, సిట్ నోటీసులు అందుకున్న నేతలు కోర్టును ఆశ్రయిస్తున్నారు. కసిరెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటీషన్ వేయగా, మరో వైపు మిథున్ రెడ్డికి కూడా విచారణ నోటీసులు జారీ అయ్యాయి. నాడు పని చేసిన అధికారులను సిట్ విచారించడం, ప్రస్తుతం మద్యం కేసులో విజయసాయి రెడ్డి సాక్ష్యాల ప్రాధాన్యం పెరగడం చూస్తే, రానున్న రోజుల్లో ఈ స్కాంలో పలువురు కీలక నేతల పేర్లు బహిర్గతమయ్యే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో భూమి కదిలే పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.