Site icon HashtagU Telugu

AP : కొడుకు కోసం రంగంలోకి దిగుతున్న విజయమ్మ..? మరి కూతురి సంగతి ఏంటి..?

Vijayamma Suport Jagan

Vijayamma Suport Jagan

వైస్ విజయమ్మ (YS Vijayamma) ఇక కొడుకు కోసం రంగంలోకి దిగబోతుందా..? మొన్నటి వరకు కూతురి (Sharmila) వెంట నడిచిన విజయమ్మ..ఇప్పుడు కొడుకు (Jagan) అడుగుజాడల్లో నడిచేందుకు సిద్ధం కాబోతుందా..? ప్రస్తుతం ఇదే చర్చ ఏపీ రాజకీయాల్లో నడుస్తుంది. భర్త రాజశేఖర్ ఉన్న టైములో బిడ్డలా విషయంలో ఎప్పుడు ఏ ఇబ్బంది పడని విజయమ్మ..ఇప్పుడు బిడ్డలా రాజకీయాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు దేశ వ్యాప్తంగా కాకరేపుతున్న సంగతి తెలిసిందే. మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో ఈసారి ఏ పార్టీ విజయం సాధిస్తుందో అని అంత లెక్కలు వేసుకుంటున్నారు. ఇదిలా ఉంటె వైస్ ఫ్యామిలీ నుండి ఇద్దరు కీలక నేతలు, రెండు వేరువేరు పార్టీల నుండి బరిలోకి దిగుతుండడం ఇప్పుడు మరింత ఆసక్తి రేపుతోంది.

కొద్దీ రోజుల క్రితం వైస్ షర్మిల..తన YSRTP పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేసి..తాను కూడా కాంగ్రెస్ పార్టీ లో చేరిన సంగతి తెలిసిందే. షర్మిల కాంగ్రెస్ గూటికి చేరడం తో ఆమెకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా అధిష్టానం బాధ్యత అప్పగించింది. ఈ బాధ్యత స్వీకరించడమే ఆలస్యం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ అధికార పార్టీ వైసీపీ తో పాటు టీడీపీ , జనసేన, బిజెపి పార్టీల ఫై విమర్శలు చేస్తుంది. ముఖ్యంగా తన అన్న జగన్ ఫై , అలాగే ఆయన నడిపిస్తున్న ప్రభుత్వం ఫై విమర్శల వర్షం కురిపిస్తూ ప్రజలను ఆకట్టుకుంటుంది.

దీంతో ఇప్పుడు వైస్ విజయమ్మ కు పెద్ద తలనొప్పిగా మారింది. మొన్నటి వరకు షర్మిల తెలంగాణ రాజకీయాల్లో , జగన్ ఏపీ రాజకీయాల్లో బిజీ గా ఉండడం..ఇద్దరు వేరు వేరు పార్టీలలో ఉండడం తో విజయమ్మ ఇద్దర్ని సపోర్ట్ చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఒకే రాష్ట్రంలో రెండు వేరు వేరు పార్టీలలో ఉండడం..ఎన్నికల బరిలో ఇద్దరు నిల్చోవడం తో విజయమ్మ కు ఇబ్బంది గా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

షర్మిల నేరుగా తన అన్నతో ఢీకొనడానికి ఇష్టం లేకే తెలంగాణలో పార్టీ పెట్టారని గతంలో ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. కాంగ్రెస్‌ పార్టీలో తాను స్థాపించిన పార్టీని విలీనం చేసేసి ఏపీలో తన అన్నను గట్టిగా ఢీకొనాలనే ధృఢ సంకల్పంతో షర్మిల రెడీ అయ్యింది. ఇలాంటి సమయంలో పిల్లల్లో విజయమ్మ సపోర్ట్ ఎవరికి అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు విజయమ్మ కూతురు వైపే మొగ్గు చూపిస్తూ వచ్చింది. కూతురుకు అండగా నిలవడమే ప్రాధాన్యతాంశంగా తీసుకున్నారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా రాజీనామా చేసినప్పుడు అదే చెప్పారు. ఇద్దరు బిడ్డలు రెండు రాష్ట్రాల్లో రాజకీయం చేస్తారని చెప్పారు. కానీ ఇప్పుడు ఒకరిపైకి ఒకరు రాజకీయం చేసే పరిస్థితులు వచ్చాయి.

షర్మిళ వైపే విజయమ్మ నిలబడితే జగనుకు నైతికంగా భారీ దెబ్బ తగిలినట్టే అని భావిస్తుండడం.. ఇప్పటికే తల్లి.. చెల్లెలను పట్టించుకోవడం లేదనే విమర్శలను జగన్‌ ఎదురుకుంటూ వస్తుండడం తో జగన్ తో పాటు పార్టీ నేతలు సైతం విజయమ్మ ఫై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తుంది. ఈసారి ఎన్నికల్లో జగన్ కే సపోర్ట్ చేయాలనీ కోరుతుండడం తో విజయమ్మ ఏంచేయలేక జగన్ కే సపోర్ట్ ఇవ్వాలని భావిస్తోందట. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేయబోతున్నట్లు తెలుస్తుంది. షర్మిల వారించినా కొడుకుకే అండగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే రాష్ట్రవ్యాప్త పర్యటనకు ఆమె సిద్ధమవుతున్నారట. మరి కొడుకు కు సపోర్ట్ చేస్తే కూతురి పరిస్థితి ఏంటి అనేది చూడాలి.

Read Also : RGV : జనసేన సీఎం అభ్యర్థి చంద్రబాబే – వర్మ సెటైర్