YS Jagan – Vijayamma : ఎన్నికల తర్వాత మొదటిసారి జగన్‌‌తో విజయమ్మ.. జగన్‌ను హత్తుకొని కన్నీరు పెట్టుకొని..

సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తరువాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన తల్లి వైఎస్ విజయమ్మ తొలిసారి కలిశారు.

Published By: HashtagU Telugu Desk
Vijayamma Crying while Hugging Ys Jagan at YSR Ghat on YSR Birth Anniversary

Ys Jagan

YS Jagan – Vijayamma : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి(YS Rajasekhar Reddy) 75వ జయంతిని రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్దకు వెళ్లి ఘనంగా నివాళులర్పించారు. జగన్ తోపాటు ఆయన సతీమణి వైఎస్ భారతి, తల్లి విజయమ్మ, పలువురు కుటుంబ సభ్యులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ సమాధిపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ కన్నీరు పర్యాంతమయ్యారు.

సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తరువాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన తల్లి వైఎస్ విజయమ్మ తొలిసారి కలిశారు. ఈ సందర్భంగా విజయమ్మ భావోద్వేగానికి గురయ్యారు. జగన్ మోహన్ రెడ్డిని హత్తుకొని కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా జగన్ తల్లిని ఓదార్చారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. విజయమ్మ అక్కడే ఉండి కన్నీరు పెట్టుకోగా.. కుటుంబ సభ్యులు ఓదార్చారు. సార్వత్రిక ఎన్నికల ముందు విదేశాలకు వెళ్లిన విజయమ్మ.. ఫలితాల తరువాత తిరిగి స్వదేశానికి వచ్చారు.

Also Read : YS Jagan – Sharmila : వైఎస్ఆర్ జ‌యంతికి వార‌స‌త్వ పోరు.. జ‌గ‌న్‌కు బిగ్‌షాక్ త‌ప్ప‌దా?

  Last Updated: 08 Jul 2024, 08:54 AM IST