రెండు రోజులుగా సోషల్ మీడియా లో , అలాగే మీడియా చానెల్స్ లలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (MP Vijaya Sai )..దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కే.శాంతి ( Shanthi ) ల పేర్లు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వల్ల తన భార్య శాంతి గర్భం దాల్చిందంటూ ఆమె భర్త మదన్ (Madan) సంచలన ఆరోపణలు చేయడం తో అంత వీరి గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక అధికార పార్టీ శ్రేణులైతే మీమ్స్ , రీల్స్ చేస్తూ నానా హడావిడి చేసారు. 80 ఏళ్ల వయసులో విజయసాయి రెడ్డి తండ్రి కాబోతున్నారంటూ విషెష్ చెపుతూ హంగామా సృష్టించారు. ఈ ఆరోపణలను శాంతి ఖండిస్తూ ఆదివారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. విజయసాయిరెడ్డితో తనకు సంబంధం అంటగట్టడం భావ్యమేనా అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
తన మాజీ భర్త చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజాలు లేవని కేవలం డబ్బుల కోసమే మదన్ మోహన్ చేస్తున్న కుట్ర అని శాంతి ఆరోపించారు. 2013లో మదన్ తో వివాహం జరిగిందని తాను హిందువు కాగా, మదన్ మోహన్ క్రిస్టియన్ కావడంతో తనను మతం మార్చుకోవాలని హింసించేవాడని ఆరోపించారు. తాను పెద్దమనుషుల సమక్షంలో 2016లో విడాకులు తీసుకున్నట్టు శాంతి స్పష్టం చేశారు. అప్పటికే తనకు ఇద్దరు కవల ఆడ పిల్లలు కలగడంతో చెరొక బిడ్డ సంరక్షణ తీసుకున్నామని శాంతి తెలిపారు. అయితే తన దగ్గర ఉన్న ఆడపిల్లను చంపేయాలని మదన్ మోహన్ బెదిరించేవాడని.. విడాకులు తీసుకున్నా తనను వేధించేవాడు అని ఆమె ఆరోపించారు. 2020లో ఉద్యోగం వచ్చిందని, సుభాష్ అనే లాయర్ ను వివాహం చేసుకున్నట్టు శాంతి వెల్లడించారు. ప్రస్తుతం వివాదాన్ని ఎదుర్కొంటున్న బిడ్డ ఆయనకే పుటినట్లు తెలిపింది.
ఇక సోమవారం ఈ ఇష్యూ ఫై ఎంపీ విజయసాయి రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనపై ప్రచారం అవుతున్న వార్తలను ఖండించారు. తన వ్యక్తిత్వంపై కుట్రపూరితంగానే అసత్య ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ‘ఓ ఆదివాసీ మహిళను బజారుకీడ్చారు. ఎంపీనైన నన్ను ఎంతోమంది కలుస్తారు. అంతమాత్రాన సంబంధం అంటగడతారా? తారతమ్యాలు లేవా? సాయిరెడ్డి తండ్రిలాంటి వ్యక్తి అని ఆమెనే చెప్పింది. ఆరోపణలు చేసినవారిపై కేసులు పెడతా అన్నారు. అసత్య వార్తలను రాసి, తన వ్యక్తిగత పరువుకు భంగం వాటిల్లేలా వ్యవహరించిన వాళ్లపై ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోనని తేల్చి చెప్పారు. ఎన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలో.. అన్ని రకాలుగా తన నిర్ణయాలు ఉండబోతోన్నాయని అన్నారు. ఈ విషయంలో సొంత పార్టీ వాళ్లయినా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి హెచ్చరించారు. విజయసాయిరెడ్డి ప్రతిపక్షంలో ఉన్నాడని, ఏం చేస్తాడని తేలిగ్గా తీసుకోవచ్చని, ఒక్కసారి పట్టుబట్టితే వెనక్కి తగ్గనని తేల్చి చెప్పారు.
Read Also : Arvind Kejriwal : నిలకడగా కేజ్రీవాల్ ఆరోగ్యం.. ఆప్ నేతలవి అసత్య ఆరోపణలు : తిహార్ జైలు