వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రభుత్వ హయాంలో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి(Chevireddy Baskar Reddy)పై దర్యాప్తు ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డి సన్నిహితులలో కీలకుడిగా పేరొందిన ఆయనపై తుడా నిధులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. తిరుపతి పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో అక్రమాలపై అనేక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో విజిలెన్స్ శాఖ దర్యాప్తు ప్రారంభించి నోటీసులు జారీ చేసింది.
World Environment Day : వనమహోత్సవం ప్రారంభించిన సీఎం చంద్రబాబు..పర్యావరణ పరిరక్షణపై మద్దతు
తుడా చైర్మన్ హోదాలో చెవిరెడ్డి, ఆ సంస్థ ఆదాయాన్ని ఎక్కువగా చంద్రగిరిలోనే ఖర్చు చేయించారు. ఇది కేవలం ప్రాంత అభివృద్ధి కోసమే కాదు, ఆయన స్వగ్రామంలో, వ్యక్తిగత అవసరాల కోసం పనులు చేయించేందుకు నిధులు వాడినట్లు చెబుతున్నారు. పనులన్నింటికీ తాను యజమానిగా ఉన్న కంపెనీ పేరులోనే టెండర్లు ఇచ్చి, ఆ డబ్బులను స్వయంగా తన కంపెనీ ఖాతాలోకి జమ చేయించుకున్నట్లు లెక్కలు బయటపడ్డాయి. దీంతో ఈ వ్యవహారంపై తీవ్రమైన విమర్శలు, నిఘా అధికారుల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో విజిలెన్స్ శాఖ నోటీసులు పంపిస్తూ వివరణ ఇవ్వాలని చెవిరెడ్డిని ఆదేశించింది. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత, ఆయన సమర్పించే సమాధానాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. చెవిరెడ్డిపై ఈ ఆరోపణలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అధికారంలో మార్పు వచ్చిన తర్వాత గత హయాంలో జరిగిన దుర్వినియోగాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు చెవిరెడ్డి ఏ వివరణ ఇస్తారన్నదే ఆసక్తికరంగా మారింది.
Fake Gold: నకిలీ బంగారు ఆభరణాలను కుదవ పెట్టి రూ. 43 లక్షల లోన్