Vidadala Rajini: అమ్మగారి అక్రమాల పుట్ట…బిగుస్తోన్న ఉచ్చు..!

కానీ కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం తమ నియోజకవర్గాన్నే.. తమ రాజ్యంగా భావించి... ప్రజలను ముప్పతిప్పలు పెట్టారు.  మహారాణిలా పెత్తనం చేసిన ఆ ప్రజా ప్రతినిధి.. ఇప్పుడు కనీసం ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఆమె ఎవరు? ఆ నియోజకవర్గం ఏంటి ? 

  • Written By:
  • Publish Date - July 1, 2024 / 04:45 PM IST

Vidadala Rajini: ఒకప్పుడు రాజుల పాలనలో.. ప్రజలకు రాజు (King) చెప్పిందే వేదం.. చేసిందే చట్టం. రాజు ఆగ్రహిస్తే కొరడా దెబ్బలు.. కరుణిస్తే వజ్ర వైడూర్యాల హారాలే.. ఇప్పుడు రాజులు లేరు, రాజ్యాలు లేవు. ఆ తరహా పాలనని ప్రజలు కూడా ఎక్కడా అనుమతించడం లేదు. కానీ కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం తమ నియోజకవర్గాన్నే.. తమ రాజ్యంగా భావించి… ప్రజలను ముప్పతిప్పలు పెట్టారు.  మహారాణిలా పెత్తనం చేసిన ఆ ప్రజా ప్రతినిధి.. ఇప్పుడు కనీసం ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఆమె ఎవరు? ఆ నియోజకవర్గం ఏంటి ?

తమ సమస్యలను పరిష్కరించి.. నియోజవర్గాన్ని (Constiuency) అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఎంతో ఆశతో నేతలను తమ ప్రజాప్రతినిధులుగా (Mla) ప్రజలు ఎన్నుకుంటారు. అయితే అధికారం అండతో అడ్డగోలుగా రెచ్చిపోయి నియోజకవర్గాన్నే తమ రాజ్యంలా (Kingdom) భావించి ఇష్టానుసారంగా పెత్తనం సాగించి పలువురు ఎమ్మెల్యేలు (Mla) ఇప్పుడు చేసిన పాపానికి మూల్యం చెల్లించుకుంటున్నారు. ప్రభుత్వ పథకాల (Govt. Schemes) నుంచి బిజినెస్ లను కొనసాగించే వరకూ కూడా అన్నింటా ముడుపులు చెల్లించకపోతే.. వారిని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు గత వైసీపీ ప్రభుత్వంలోని (Ycp Govt పలువురు ప్రజాప్రతినిధులు. ఇక కూటమి ప్రభంజనానికి ఫ్యాన్ కుప్పకూలి .. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక (Alliance Govt).. వైసీపీ నేతల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట (Chilakaluripeta) నియోజకవర్గం ఏపీ రాజకీయాల్లో (Ap Politics) హాట్ టాపిక్ గా మారుతోంది. మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఐదేళ్లు మంత్రిగా కొనసాగి సీనియర్లకు (Seniors) కూడా షాక్ ఇచ్చారు విడదల రజినీ (Vidadala Rajini). అధికారం అండతో మాజీ మంత్రి (Ex Minister) నియోజకవర్గంలో ప్రజలను ఏ రకంగా ఇబ్బందులు పెట్టారోనని ఒక్కో ఘటన వెలుగులోకి వస్తున్నాయి. ప్రజాప్రతినిధిని అనే విషయం మర్చిపోయి తన అనుచరులు తన కుటుంబీకులతో రాచరికపు పరిపాలన సాగించిందని స్వయంగా నియోజకవర్గ ప్రజలే (Public) చెప్పటం ఇప్పుడు అందరిని నోటిన వేలు వేసుకునేలా చేస్తుంది. రజినీతో పాటు.. ఆమె మరిది గోపి (Gopi), పీఏ రామకృష్ణ (Rama Krishna) ఆగడాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.

పసుమర్రు (Pasumarru Farmers) రైతులను ఆదర్శంగా తీసుకున్న గుదేవారిపాలెం రైతులు సైతం ప్రస్తుతం రజనీపైన ఫిర్యాదుకు (Complaints) సిద్ధమయ్యారు. జగనన్న కాలనీ కోసం తీసుకున్న తమ భూములకు పరిహారంగా ఇచ్చే డబ్బుల్లో కూడా కమిషన్ (Commission) రూపంలో నాలుగు లక్షల వసూలు చేశారంటూ గోడు వెళ్లబోసుకున్నారు. అందుకు గాను రజినీ పీఏ రామకృష్ణకు మధ్యవర్తిగా శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి వ్యవహరించినట్టు బాధితులు చెబుతున్నారు. మరోవైపు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు (Mp Lavu Sri Krishnadevarayulu) వద్దకు రజినీ (Rajini) బాధితులు క్యూ కడుతున్నారు. చిలకలూరిపేట టౌన్ లో స్థలాన్ని ఆక్రమించారంటూ మరో బాధితుడు కూడా ఎంపీకి ఫిర్యాదు (Complaints) చేసినట్టు తెలుస్తోంది. అలానే పట్టణ పరిధిలో పెట్రోల్ బ్యాంక్ ఉన్న స్థలాన్ని ఆక్రమించి బెదిరింపులకు పాల్పడుతున్నారని విడదల గోపీనాథ్ (Vidadala Gopinadh) పై ఫిర్యాదు చేయడం కలకలంగా మారింది.

ఎమ్మెల్యేగా తనకున్నటువంటి పవర్స్ ని నియోజకవర్గ అభివృద్ధికి (Devlopement) కాకుండా తాను రాజకీయంగా ఎదగటానికి మాత్రమే రజినీ (Vidadala Rajini) ఉపయోగించుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తనకు తానే తన చుట్టూ ఒక కంచెను ఏర్పాటు చేసుకొని సామాన్యులకు ఆ కంచె దాటి వెళ్లే పరిస్థితి లేకుండా చేశారని.. అదే కాకుండా నియోజకవర్గంలో ప్రతీ పనిలోనూ రజినీ కుటుంబ సభ్యులు (Family Members) వేలు వేలు పెట్టడం.. పరోక్షంగా తామే ఎమ్మెల్యేలుగా భావించి అధికారాన్ని వినియోగించడం.. ఆమె ఓటమికి (Loose) కారణమయ్యాయని (Reason) అంటున్నారు. నియంతగా మారిన రాజుల్ని ప్రజలు ఎలా తరిమికొట్టారో.. అదే విధంగా ప్రస్తుతం చిలకలూరిపేట నియోజకవర్గ (Chilakaluripeta) ప్రజలు సైతం రజినీ పేరు చెప్తే అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారని తెలుస్తోంది.

2019 ఎన్నికల్లో చిలకలూరిపేట (Chilakaluripeta) నుంచి బరిలోకి దిగిన రజినీ.. 2024 ఎన్నికల్లో మాత్రం గుంటూరు వెస్ట్ (Guntur West) నుంచి పోటీ చేసి ఓటమి (Loose) పాలయ్యారు. పార్టీ కార్యకర్తలు సైతం ఆమెను కలవాలంటే మూడు అంచల కంచెని దాటాల్సిన పరిస్థితులు ఉండేవని అంటున్నారు. ఆమె గెలుపు కోసం పనిచేసిన సొంత పార్టీ నేతలే… రజినీ (Rajini) చేసిన అరాచకాల గురించి వాపోతుండడం మరింత చర్చనీయాంశం అవుతోంది. సామాన్య ప్రజలు కానీ, మీడియా కానీ.. మాజీ మంత్రిని (Ex Minister) సంప్రదించాలన్నా.. ముందుగా తన చుట్టూ ఉండే కొఠారిలోని పిఏ లను సంతృప్తి చేస్తే తప్ప ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉండేదనేది పార్టీ వర్గాల్లో (Party Talk) ఓపెన్ సీక్రెట్ (Open Secret) గా నడిచింది. రజినీకి గుంటూరు వెస్ట్ లో (Guntur West) మొదటిలో మంచి పేరు వచ్చినప్పటికీ.. తన చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తన వల్ల ప్రజల్లోకి పూర్తిస్థాయిలో నెగిటివ్ ఇమేజ్ (Negative Image) తీసుకెళ్లాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. అందుకే చిలకలూరిపేట ప్రజలు లాగా మోసపోతామేమోనని.. గుంటూరు వెస్ట్ లో ఓటమి కట్టబెట్టారని టాక్ ఉంది.

మొత్తానికి ఈ వరుస వివాదాలతో ప్రజల ముందుకు కూడా విడుదల రజిని వెళ్లలేని పరిస్థితి నియోజవర్గంలో నెలకొంది. ప్రజల నమ్మకాన్ని ఒమ్ముచేస్తూ.. అధికారం అండతో అడ్డగోలుగా రెచ్చిపోతే.. చివరకు ఈ పరిస్థితే ఎదురవుతుందనే విమర్శలు వస్తున్నాయి. మరి ఈ పరిస్థితి ఎంత వరకు కొనసాగుతుందో చూడాలి.