షర్మిల మూడేళ్ల కిందటే ఏపీకి వెళ్లి ఉంటె బాగుండేది- VH

  • Written By:
  • Publish Date - May 24, 2024 / 09:10 AM IST

వైస్ షర్మిల మూడేళ్ల కిందటే ఏపీకి వచ్చి ఉంటె ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరోలా ఉండేదని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ సీనియర్ నేత VH హనుమంతరావు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహ తయారీని రాజమహేంద్రవరం లో సిద్ధం చేస్తున్న తరుణంలో విగ్రహ నమూనా పరిశీలించేందుకు గాను ఆయన నగరానికి రావడం జరిగింది. నమూనా పరిశీలిన అనంతరం.. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్బంగా VH మాట్లాడుతూ.. షర్మిల… తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడే.. ఏపీ వెళ్లి అన్నతో తేల్చుకోవాలని చెప్పినట్లు గుర్తు చేసారు. ఆమె మూడేళ్ల కిందటే ఏపీకి వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. వచ్చే ఐదేళ్లలో ఇక్కడ కూడా కాంగ్రెస్ బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. షర్మిల కొద్దీ సమయంలోనే గట్టి పోటీ ఇచ్చారని, జగన్ ప్రభుత్వంపై గట్టి పోరాటం చేశారని తెలిపారు. జగన్‌ జైల్లో ఉన్నప్పుడు షర్మిల అన్న కోసం రాష్ట్రమంతటా పాదయాత్ర చేసి..ఎంతో కష్టపడిందని, తర్వాత ఆమెకు జగన్ రాజకీయంగా ఎటువంటి అవకాశం ఇవ్వలేదన్నారు. ఏపీ రాజకీయాల గురించి మాట్లాడటం సరికాదని, అయితే రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక సంఘటనల గురించి తనకు తెలుసన్నారు.

పదేళ్లు అధికారంలో ఉన్న బిజెపి సర్కార్ ఏం అభివృద్ధి చేశారని హనుమంతరావు ప్రశ్నించారు. యూపీఏ హయాంలోనే అభివృద్ధి అంతా జరిగిందని, బిజెపి ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు. ఇండియా కూటమి క్యాన్సర్‌ వంటిదని, పాకిస్తాన్‌ మద్దతుదారులంటూ మోడీ విమర్శించడాన్ని వీహెచ్‌ తప్పుబట్టారు. బిజెపి మతాలు, కులాల మధ్య విద్వేషాలు సృష్టించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. బీజేపీ మాటతీరు మార్చుకోవాలన్నారు. 400 సీట్లు వస్తే పీఓకేను స్వాధీనం చేసుకుంటామని చెబుతున్న బీజేపీ నాయకులు ఈ పదేళ్లు ఆ పని ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ నేతృత్వంలోని ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Read Also : Pilgrimage Killed in Accident: ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఏడుగురు భ‌క్తులు దుర్మ‌ర‌ణం