Site icon HashtagU Telugu

Stone Attack on CM Jagan: వైఎస్ జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్

Stone Attack on CM Jagan

Stone Attack on CM Jagan

Stone Attack on CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీ, ఎన్డీయే కూటమి మధ్య రసవత్తర పోరు జరిగింది. గెలుపే లక్ష్యంగా పోటీ పడ్డాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో ఆంధ్రప్రపదేశ్ రాజకీయాలను హీట్ పుట్టించారు. కాగా ఎన్నికల ప్రచారంలో సీఎం వైఎస్ జగన్ పై నాటకీయ పరిణామం చోటు చేసుకుంది.

మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా ఏప్రిల్ 13న విజయవాడలో సీఎం జగన్ పై రాయి దాడి జరిగింది. ఈ కేసులో పోలీసులు సతీశ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే సతీష్‌ బెయిల్‌ పిటిషన్‌పై విజయవాడ కోర్టులో 8వ అదనపు జిల్లా కోర్టులో విచారణ జరిగింది. న్యాయవాది వాదనల అనంతరం న్యాయమూర్తి తీర్పును రిజర్వ్‌లో ఉంచారు. మంగళవారం ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. సీఎం జగన్‌పై రాళ్ల దాడి జరిగినప్పటి నుంచి ఈ కేసు పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.

మరోవైపు సతీశ్ ను ఈ కేసులో అక్రమంగా ఇరికించారని అతడి తరఫు న్యాయవాది సలీం వాదనలు వినిపించారు. కాగా నిందితుడి బెయిల్ పిటిషన్ తీర్పుకు సంబంధించి రేపు ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ కేసుని ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా సీరియస్ తీసుకుని విచారణ జరిపారు. కాగా ఈ దాడి కేవలం రాజకీయ లబ్ది పొందేందుకేనని ప్రతిపక్ష టీడీపీ పార్టీ ఆరోపించింది. అటు వైసీపీ కూడా ఘాటుగా బదులిచ్చింది. తమ అధినేతపై జరిగిన దాడిని బూటకపు దాడిగా పేర్కొన్న టీడీపీపై మండిపడ్డారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ పార్టీ ఇలాంటి నీచపు రాజకీయాలకు పాల్పడదని వైసీపీ ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఏదేమైనా జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Also Read: Road Accidents: రోడ్డు ప్రమాదంలో తెలంగాణ జిల్లా కోర్టు జడ్జి మృతి