Site icon HashtagU Telugu

Venkaiah Naidu : ప్రస్తుత రాజకీయాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు

Venkayya Naidu comments on political leaders

Venkayya Naidu comments on political leaders

ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే చీదర వేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేసారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Former Vice President of India Muppavarapu Venkaiah Naidu) . గుంటూరులో కాసరనేని సదాశివరావు శత జయంతి ఉత్సవాలకు (Dr.Kasaraneni Birth Centenary Celebrations) వెంకయ్యనాయుడు ముఖ్య అతిధిగా హాజరైన వెంకయ్యనాయుడు ..ప్రజా వైద్యునిగా, కళా ప్రియునిగా ప్రముఖ వైద్యులు డాక్టర్ కాసరనేని సదాశివరావు (Famous Doctor Dr. Kasaraneni Sadashiva Rao) ఎంతో సేవ చేశారని కొనియాడారు. రాజకీయాల్లో కూడా సదా శివరావు తనదైన శైలిలో సామాన్యులకు అందుబాటులో ఉన్నారని గుర్తుచేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇప్పటి హాస్పిటల్ ల లో ఫీజులు మాత్రమే పరమావధితో వైద్యం చేస్తున్నారు అన్న అపవాదు ఉంది.. దాని నుండి వైద్య రంగం బయట పడాలి అని ఆకాక్షించారు వెంకయ్య నాయుడు.. ఇక, కులం,డబ్బు అండతో క్రిమినల్స్ రాజకీయాల్లో ఉన్నారు.. బూతులు మాట్లాడుతున్న రాజకీయ నాయకులకు (Political Leaders) పోలింగ్ బూతులో సమాధానం చెప్పాలన్నారు. చట్ట సభలు ప్రజలకు మేలు చేసే దేవాలయాలు.. వాటిని ప్రతీకారం తీర్చుకునే కోసం వాడుకోకూడదని హితవుపలికారు.. కులం చూసి కాదు, గుణం చూసి ఓటు వేయండి అని విజ్ఞప్తి చేశారు. దురదృష్టవశాత్తు ప్రస్తుత రాజకీయాల్లో విలువలు గల నాయకులు తగ్గారని వెంకయ్య అన్నారు.

చదువుకున్న వారు రాజకీయాల్లో రావాలని, సేవా భావం ఉన్నవారు వైద్య వృత్తిలో ఉండాలన్నారు. ఇప్పుడు కొందరు అనవసరంగా లేని పోని వైద్య పరీక్షలు రాసి రోగి జేబులు ఖాళీ చేస్తున్నారని మండిపడ్డారు.

Read Also : Hyderabad : బోయిన్‌పల్లిలో విషాదం.. కుమార్తెలతో కలిసి తండ్రి ఆత్మహత్య