Site icon HashtagU Telugu

Venkata Krishna Prasad : టీడీపీలో చేరిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్

Vasantha Krishna Prasad Shocking Comments On Own Party Leaders

Vasantha Krishna Prasad Shocking Comments On Own Party Leaders

మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ టీడీపీలో చేరారు. హైదరాబాద్‌లో చంద్రబాబు సమక్షంలో వసంత కృష్ణప్రసాద్‌ టీడీపీ కండువా కప్పుకున్నారు. రాష్ట్రంలో త్వరలో ఎన్నికల నగారా మోగనుంది. అయితే అంతకుముందే అధికార పార్టీ వైసీపీకి వరుస షాక్​లు తగులుతున్నాయి. గత కొద్దీ రోజులుగా వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు పెరుగుతుండటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వైసీపీ అధిష్ఠానం ఉంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ (Vasantha Venkata Krishna Prasad) బాబు సమక్షంలో టీడీపీ లో చేరారు. మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ కు సీఎం జగన్ ఈసారి టికెట్ నిరాకరించారు. దీంతో ఆయన వైసీపీ రాజీనామా చేసి , టీడీపీ లో చేరారు. టీడీపీ అభ్యర్థిగా మైలవరం నియోజకవర్గం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ పోటీ చేస్తారని తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ముందుగా నందిగామ మండలం అంబర్​పేటలోని శ్రీ సత్యమ్మ అమ్మవారి దేవాలయంలో సతీమణి శిరీషతో కలిసి ఎమ్మెల్యే వసంత ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి మైలవరం నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులు ప్రజాప్రతినిధులు వసంత నివాసానికి పోటెత్తారు. వారందరితో ఉదయం నుంచి మాట్లాడారు. రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ఆయన స్వగ్రామం ఐతవరం నుంచి హైదరాబాద్​కు బయలుదేరారు. శనివారం ఉదయం బాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు.

అలాగే ఈరోజు నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు (Lavu Sri Krishna Devarayalu) సైతం టీడీపీ చేరనున్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో శనివారం జరిగే రా కదిలిరా బహిరంగ సభలో చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు కృష్ణదేవరాయలు ప్రకటించారు. అదే విధంగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemireddy Prabhakar Reddy) సైతం ఈరోజు టీడీపీ లో చేరనున్నారు. ఇప్పటికే నెల్లూరు జిల్లా వరికుంటపాడులో వైసీపీకి పలువురు నేతలు రాజీనామా చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో వారంతా టీడీపీ చేరుతున్నట్లు ప్రకటించారు.

Read Also : Medicines: సుద్దపొడితో తయారు చేసిన మందులు.. తెలంగాణలో విక్ర‌యం..!