Site icon HashtagU Telugu

Woman missing : పవన్ కళ్యాణ్ పై వాసిరెడ్డి పద్మ విమర్శలు

Vasireddy Padma Fires on Pawan Kalyan

Vasireddy Padma Fires on Pawan Kalyan

ఏపీలో 26 వేల మంది మహిళలు అదృశ్యమైనట్టు (Missing women) పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయకముందే..పవన్ కళ్యాణ్  (Pawan Kalyan)వారాహి యాత్రలో ఈ విషయాన్నీ ప్రజలకు తెలిపాడు. అయితే అప్పుడు వైస్సార్సీపీ నేతలు పవన్ కళ్యాణ్ ఫై విరుచుకపడ్డారు. ఇక ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా కేంద్రం చెప్పడం తో ఇప్పుడేం అంటారు జగన్ మోహన్ రెడ్డి గారు అంటూ జనసేన శ్రేణులు , నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం పవన్ కళ్యాణ్ ఫై విరుచుకుపడుతుంది.

ఒక క్రిమినల్ కహానీ అల్లి మ‌హిళా ప‌క్ష‌పాతి ప్రభుత్వాన్ని పలచన చేయాలన్నది పవన్ కళ్యాణ్ కుట్ర అని మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ వాసిరెడ్డి(Vasireddy Padma) ప‌ద్మ అన్నారు. ఏపీ (AP)లో మహిళల అదృశ్యం పైనే రాజ్యసభ ఎందుకు ఎక్కువ ఆందోళన చెందుతోందని పద్మ ప్రశ్నించారు. మహిళల అదృశ్యంలో ఏపీ 11వ స్థానంలో ఉందని, ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ ఎందుకు ప్రస్తావించడం లేదని అన్నారు. ఏపీనే పవన్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.

రాజ్యసభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి చేసిన ప్ర‌క‌ట‌న‌ను చూపించి దానిపై పవన్ అనేక వ‌క్రీక‌ర‌ణ‌లు చేస్తున్నార‌ని, మొద‌టి ప‌ది స్థానాల్లో ఉన్న రాష్ట్రాల గురించి మాట్లాడ‌కుండా, తెలుగు రాష్ట్రాల సంబంధించిన మ‌హిళ‌ల అదృశ్యం గురించి మాట్లాడటం వెనుక ఉద్దేశాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌న్నారు.

ఏపీని ఒక దోషిగా, అరాచ‌క ప‌రిస్థితి ఉన్న‌ట్టుగా చూపించే తాప‌త్ర‌యం ఎందుకుప‌డుతున్నార‌ని నిల‌దీశారు. ప‌ది రాష్ట్రాల్లో ఏపీ కంటే ఎక్కువ కేసులు న‌మోద‌వుతున్నాయ‌ని, దేశంలోని స‌మ‌స్య‌ను పక్క‌న‌బెట్టి ఏపీ మాత్ర‌మే టార్గెట్ ప‌వ‌న్ రాజ‌కీయాలు చేస్తున్నార‌న్నారు. వలంటీర్ వ్యవస్థ వల్లనే ఏపీలో మహిళల అదృశ్యం అంటూ ప్ర‌జ‌ల‌కు సేవ‌లందిస్తున్న వ్య‌వ‌స్థ‌పై ప‌వ‌న్ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. వ‌లంటీర్ వ్య‌వ‌స్థే అదృశ్యాల‌కు కార‌ణం అని చెప్ప‌డానికి ప‌వ‌న్ ద‌గ్గ‌రున్న ఆధారాలేంటో చెప్పాల‌ని మ‌హిళా క‌మిష‌న్ నోటీసులు ఇచ్చింద‌న్నారు.

ప్రేమ వ్యవహారాల వల్లే చాలా మంది అమ్మాయిలు అదృశ్యమవుతున్నారని వాసిరెడ్డి పద్మ అన్నారు. ఈ ప్రేమలకు సినిమాలు కూడా కారణం కాదా? అని ప్రశ్నించారు. తప్పిపోయిన వారిలో 70 శాతం మంది వెనక్కి వస్తున్నారనే విషయాన్ని ఎందుకు గుర్తించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. మహిళలను గౌరవించడాన్ని పవన్ నేర్చుకోవాలని హితవు పలికారు.

Read Also: తమిళ ఇండస్ట్రీ ఫై పవన్ చేసిన వ్యాఖ్యలకు నాజర్ క్లారిటీ