వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి (YCP MP Avinash Reddy) అనుచరుడు వర్రా రవీంద్రారెడ్డి(Varra Ravindra Reddy)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ (YCP Govt) హయాంలో చాలామంది సోషల్ మీడియా వేదికగా అసభ్య కరమైన వీడియోలు , ఫోటోలు పోస్ట్ చేయడం , టీడీపీ , జనసేన నేతలను టార్గెట్ చేయడం వారి కుటుంబ సభ్యులపై అసభ్యంగా మాట్లాడడం చేస్తూ పైశాచిక ఆనందం పొందారు. అలాంటి వారిలో వర్రా రవీంద్రారెడ్డి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో ఎన్నో తప్పులు చేసాడు. ఇక ఇప్పుడు కూటమి సర్కార్ వచ్చి సోషల్ మీడియా లో అసభ్యంగా ప్రవర్తించిన వారందరి తాటతీస్తుంది.
JIO Warning : కాల్ బ్యాక్ చేస్తే రూ.300 కట్..!
ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డిని పులివెందుల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో చేసిన వివాదాస్పద పోస్టులు, అసభ్యకర వ్యాఖ్యల నేపథ్యంలో అతడిపై కేసులు నమోదయ్యాయి. కడప జైలు నుంచి రిమాండ్‌పై తీసుకుని, వైద్య పరీక్షల అనంతరం కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వర్రా రవీంద్రారెడ్డిపై మొత్తం 50 కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో 10 కేసులు కడప జిల్లాలో కాగా, మిగతా 40 కేసులు రాష్ట్రవ్యాప్తంగా నమోదయ్యాయి. వైసీపీకి మద్దతుగా, ప్రత్యర్థి పార్టీ నాయకులపై అసభ్యకర పోస్టులు పెట్టడం వల్ల అతడు ఇప్పుడు జైలు జీవితం గడపాల్సి వస్తుంది. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్, అనిత వంటి నేతలపై వరుస పోస్టులు చేయడం అతనికి కష్టాలను తెచ్చిపెట్టింది. కేసుల విచారణలో భాగంగా పోలీసులు అతడిని రెండురోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. ఈ సమయంలో అతడి సోషల్ మీడియా పోస్టులు, సంబంధాలు, ఇతర ఆరోపణలపై విచారణ జరుగుతోంది. పోస్టులు పెట్టేందుకు ఉపయోగించిన పరికరాలు, డిజిటల్ ఆధారాలు కూడా పోలీసులు సేకరించినట్లు సమాచారం. సోషల్ మీడియాను తప్పుడు ప్రయోజనాలకు వాడితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఈ ఘటన ద్వారా మరోసారి స్పష్టమవుతోంది. ఇదిలా ఉండగా వర్రా రవీంద్రారెడ్డిని కఠినంగా శిక్షించాలని, అతడిపై చర్యలు తీసుకోవాలని కూటమి శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.