Janasena Candidates List : జనసేన కు 24 స్థానాలు ఇవ్వడం ఫై వర్మ సెటైర్లు..

  • Written By:
  • Publish Date - February 24, 2024 / 03:18 PM IST

మెగా ఫ్యామిలీ ఫై , ముఖ్యంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై నిత్యం సెటైర్లు , విమర్శలు చేసే..దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV)..మరోసారి తన చేతికి పనిచెప్పారు. పవన్ కళ్యాణ్ జనసేన (Janasena) పార్టీ పెట్టిన దగ్గరి నుండి పవన్ ను నిత్యం ఫాలో అవుతూ..ఆయన ఏంచేసినా..ఎక్కడికి వెళ్లిన..ఏ పని మొదలుపెట్టిన దానిపై తనదైన శైలి లో సెటైర్లు వేసే వర్మ…తాజాగా ప్రకటించిన అభ్యర్థుల లిస్ట్ (Janasena Candidates) ఫై స్పందించారు.

“23 ఇస్తే టీడీపీ లక్కీ నెంబర్ అని ట్రోల్ చేస్తారు….25 ఇస్తే పావలాకి పావలా సీట్లు ఇచ్చారు అని ట్రోల్ చేస్తారు…అందుకే మధ్యే మార్గంగా 24 ” ఇచ్చారంటూ కామెంట్స్ చేసారు.

ఏపీ(AP)లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార – ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో బిజీ అయ్యాయి. ఇప్పటికే అధికార పార్టీ ఏడు జాబితాలను రిలీజ్ చేయగా..ఈరోజు శనివారం టీడీపీ – జనసేన (TDP-Janasena) ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ 94 మందితో కూడిన లిస్ట్ రిలీజ్ చేయగా..జనసేన 05 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు. ఈ ఐదుగురిలో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడం జనసేన శ్రేణుల్లో నిరాశ కు గురి చేసింది. పవన్ కళ్యాణ్ పేరు మొదటి లిస్ట్ లోనే వస్తుందని అనుకున్నారు కానీ..లిస్ట్ లో పవన్ పేరు లేదు.

We’re now on WhatsApp. Click to Join.

కేవలం తెనాలి: నాదెండ్ల మనోహర్, నెల్లిమర్ల: లోకం మాధవి, అనకాపల్లి: కొణతాల రామకృష్ణ, రాజానగరం: బత్తుల బలరామ కృష్ణ, కాకినాడ రూరల్: పంతం నానాజీ పేర్లను మాత్రం ప్రకటించారు. అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేస్తారనేది ఇంకా ఖరారు చేసుకోలేదని తెలుస్తుంది. అయితే జనసేన కేవలం 24 స్థానాల్లోనే పోటీ చేయడం ఫై జనసేన శ్రేణులు సైతం కాస్త నిరాశకు లోనవుతున్నారు. కనీసం 60 స్థానాల్లోనైనా పోటీ చేస్తుందని భావిస్తే కేవలం 24 కే పరిమితం కావడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.

Read Also : Sajjala : 24 స్థానాల్లో పవన్ వైసీపీపై యుద్ధం చేయగలరా..?: సజ్జల