AP : వర్మ మరింత దూకుడు..చం(ద్ర)మామ కథ అంటూ పోస్ట్..

సిఐడి చూపించిన ప్రాథమిక ఆధారాల బట్టి జడ్జిగారు చంద్రబాబును జైల్లో వేశారు. ఇంటి దొంగను ఈశ్వరుడు పట్టలేక పోవచ్చు కానీ సిఐడి పట్టేసింది

  • Written By:
  • Publish Date - September 16, 2023 / 07:41 PM IST

రామ్ గోపాల్ వర్మ (RGV) మరోసారి రెచ్చిపోయాడు. స్కిల్ డెవలప్ కేసు లో చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) అయినా దగ్గరి నుండి ఆయన ఫై రకరకాల పోస్టులు, సాంగ్స్ , ట్వీట్స్ చేస్తూ వస్తున్న వర్మ..నిన్నటికి నిన్న 12 ప్రశ్నలు వేసి..వాటికీ సమాదానాలు ఎవరైనా చెప్పచ్చు అని పోస్ట్ చేసాడు.

ఇక ఈరోజు చం(ద్ర)మామ కథ అంటూ మరో పోస్ట్ పెట్టి టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహం తెప్పించాడు. చం(ద్ర)మామ కథ అని టైటిల్ పెట్టిన వర్మ చంద్రబాబు స్కిల్ స్కాంని, చందమామ కథలా పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలంటే… ఇలా చెప్పొచ్చు అంటూ ఓ కథలాగా తెలిపాడు. 2014లో సీమెన్స్ సబ్సిడరీ కంపెనీ, డిజైన్ టెక్ కి సంబందించిన వ్యక్తి స్కిల్ డవలప్మెంట్ ప్రోగ్రామ్ విషయమై చంద్రబాబుని కలిసారని, 3700 కోట్ల ప్రాజెక్ట్ లో ప్రయివేటుసంస్థ సీమెన్స్ 90% పెట్టేటట్టు 10% ప్రభుత్వం పెట్టేటట్టు ఒక ప్రపోజల్ పెట్టారన్నారు.

ఇక దానికి రూల్స్ పాటించకుండా చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (Skill Develeopment ) ఏర్పాటు చేసి తన సన్నిహితులను సీఈవో, డైరెక్టర్, ఎం డి లుగా నియమించి అధికారికంగా ఒక జీవో రిలీజ్ చేశారని వర్మ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఎంఓయు కుదుర్చుకొని స్కాం కు పాల్పడ్డారని ..అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే జీవోలో ఉన్నది వేరు ఎంఓయూ లో ఉన్నది వేరని వర్మ పేర్కొన్నారు.

మన ప్రభుత్వ వాటా 10% , సీమెన్స్ వాళ్ళు ఎప్పుడెప్పుడెంతిస్తున్నారన్నదానిబట్టి , ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ బట్టి మాత్రమే ఇవ్వాలని ఫైనాన్స్ సెక్రెటరీ సునీత, ఇంకా ఇతర సంబందిత ఆఫీసర్లు ఎన్ని అభ్యంతరాలు చెప్పినా వినకుండా, చంద్రబాబు మొత్తం డబ్బులు రిలీజ్ చేసెయ్యాలని ఆదేశాలిచ్చారని ..దానితో 371కోట్లు ప్రైవేటు సంస్థ అయినా డిజైన్ టెక్ కు రిలీజ్ చేసేశారని, ఎలాంటి టెండర్లు లేకుండా పూర్తి నామినేషన్‌ పద్ధతిలో ఇచ్చేశారని వర్మ పేర్కొన్నారు.

ఇదే విషయాన్ని అధికారులు నోట్ ఫైల్స్‌లో రికార్డు చేసారు .డిజైన్ టెక్ తమ దగ్గరికి చేరిన డబ్బుని వేరే వేరే కంపెనీలకి పంపించేసింది . ఆ కంపెనీలన్నీఫేక్ ఇన్వాయిస్ లు క్రియేట్ చేసి డబ్బుని రీ రూట్ చేసే షెల్ కంపెనీలకు పంపించారు. ఆ కంపెనీలని ఇన్వెస్టిగేట్ చేస్తున్న జిఎస్టిడిపార్ట్మెంట్ ఈ విషయాన్ని చంద్రబాబు ప్రభుత్వాన్ని అలెర్ట్ చేసింది.ఈ ఇన్ఫర్మేషన్ తెలిసి కూడా చంద్రబాబు యాక్షన్ తీసుకోలేదు.. పైగా ఇష్యూ కి సంబందించిన నోట్ ఫైల్స్ హార్డ్ కాపీలని వెంటనే మాయం చేసేసారు. అక్కడే చంద్రబాబు తప్పులో కాలేశారు అని షాడో ఫైల్స్ అనబడే వాటి కాపీలని ఫైనాన్స్ మినిస్ట్రీ లొ డిలీట్ చెయ్యడం మర్చిపోయారని పేర్కొన్నారు. ఆ ఫైల్స్ అధికారులకి చిక్కాయని, యాక్షన్ తీసుకోకపోవటానికి కారణం,మాయమైన ఆ మొతం డబ్బు ,షెల్ కంపెనీల ద్వారా , హవాలా మార్గాల ద్వారా మళ్ళీ చంద్రబాబు దగ్గరికే వచ్చుండచ్చు.

Read Also : Chandrababu Remand: పార్లమెంట్‌లో చంద్రబాబు అక్రమ అరెస్టుపై చర్చకు టీడీపీ ప్లాన్

కాబట్టి , ఈ స్కాం అంతా చంద్రబాబు కి తెలిసే జరిగిందన్న అనుమానం ఏపీ సిఐడి కి కలిగి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిందన్నారు. 2018లో ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే తప్పు జరిగిందని చంద్రబాబు ఎంక్వయిరీ ఆర్డర్ చేసి ఉంటే అధికారులను ఇరికించి తను తప్పుకోవడానికి ఛాన్స్ ఉండేదని, చంద్రబాబు అలా చేయకుండా ఇప్పుడు ఈ స్కామ్ లో ఇరుక్కుపోయారని పేర్కొన్నారు. ఈ లోగా సీమెన్స్ కంపెనీ మాకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో ఏం సంబంధం లేదని తేల్చి చెప్పేసింది. కథ కాని కథలా, ఇన్వెస్టిగేషన్ ఇలా సాగుతుండగా అదే క్రమంలో ఈడి, ఐటీ డిపార్టుమెంట్ల నుంచి వచ్చిన ఇన్పుట్ ల తొ స్టేట్ సిఐడి ఇన్వెస్టిగేట్ చేస్తూ చేస్తూ మొన్న మొన్న చంద్రబాబును అరెస్ట్ చేసింది . సిఐడి చూపించిన ప్రాథమిక ఆధారాల బట్టి జడ్జిగారు చంద్రబాబును జైల్లో వేశారు. ఇంటి దొంగను ఈశ్వరుడు పట్టలేక పోవచ్చు కానీ సిఐడి పట్టేసింది. చట్టం ముందు అందరూ సమానమేనని జ్యుడీషియరీ నిరూపించింది. ఈ కథ సమాప్తం కాదు.. మిగతా కథ వచ్చే వారాల్లో అంటూ రాంగోపాల్ వర్మ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ ఫై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు.