Varla Ramaiah : మంత్రి రోజాపై వర్ల రామయ్య ఫైర్.. బాబు అధికారంలోకి రాగానే మొదట జైలుకు వెళ్ళేది రోజానే..

ఇటీవల బాబు అరెస్ట్ అయిన రోజు మంత్రి రోజా(Roja) నగరిలో టపాసులు పేల్చి, డ్యాన్సులు చేసి, స్వీట్లు పంచిపెట్టి హడావిడి చేసింది.

Published By: HashtagU Telugu Desk
Varla Ramaiah fires on Minister Roja for dancing on Chandrababu Arrest

Varla Ramaiah fires on Minister Roja for dancing on Chandrababu Arrest

ఏపీ(AP)లో చంద్రబాబు అరెస్టు(Chandrababu Arrest)పై అన్ని పార్టీల రాజకీయ నాయకులు మీడియా ముందుకు వచ్చి తమ గొంతు విప్పుతున్నారు. అధికార పార్టీ నాయకులు చంద్రబాబు అరెస్టు సరైనదే అంటూ బాబుపై మరింత ఫైర్ అవుతున్నారు. టీడీపీ నాయకులు, ప్రతిపక్షాలు బాబు అరెస్ట్ ని ఖండిస్తూ మాట్లాడుతున్నారు. ఇటీవల బాబు అరెస్ట్ అయిన రోజు మంత్రి రోజా(Roja) నగరిలో టపాసులు పేల్చి, డ్యాన్సులు చేసి, స్వీట్లు పంచిపెట్టి హడావిడి చేసింది.

దీంతో రోజా కూడా వైరల్ అయింది. చంద్రబాబు అరెస్టయితే రోజా ఎందుకు ఇంత హడావిడి చేస్తుంది అని అంతా అనుకున్నారు. అసలు రోజా చేసిన హడావిడి చూస్తే చంద్రబాబు మీద పర్సనల్ గా పగ పెంచుకుందేమో అని అంతా భావించారు. రోజా చేసిన పనిపై విమర్శలు కూడా వచ్చాయి. చంద్రబాబు అరెస్ట్ పై మాట్లాడితే సరిపోతుంది, అధికార పార్టీ కాబట్టి సమర్దిస్తే సరిపోతుంది, అంతే కానీ ఈ రేంజ్ లో డ్యాన్సులు చేసి, స్వీట్స్ పంచి హడావిడి ఎందుకు అని పలువురు కామెంట్స్ కూడా చేశారు.

తాజాగా టీడీపీ నేత వర్ల రామయ్య(Varla Ramaiah) రోజాపై ఫైర్ అయ్యారు. నేడు వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబును అరెస్టు చేస్తే ఓ మహిళా మంత్రి స్వీట్లు పంచి, బాణాసంచా కాల్చుతూ రోడ్డుపై నృత్యం చేశారు. అసలు ఒక మహిళా మంత్రి ఇలా చేయడం ఏంటి? ఈ మహిళా మంత్రి చరిత్ర బయటికి తీశాం. చెన్నైలో ఎన్ని ఆస్తులు కొన్నారో దస్తావేజులతో సహా సేకరించాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ఆమెను జైలుపాలు చేస్తాం. పేర్ని నాని, అమర్నాథ్, అంబటి రాంబాబు చిట్టా కూడా మా వద్ద వుంది. అధికారంలోకి రాగేనే వారికి కూడా రాజమండ్రి జైలులో చిప్ప కూడు తినిపిస్తాం. ఏం సాధించారని సిట్ అధికారులు సిట్ కార్యాలయంలో స్వీట్లు పంచుకుంటారు? కొందరు పోలీసు అధికారులు ప్రభుత్వ ఉద్యోగులా, జగన్ కు తాబేదారులా అర్థం కావడంలేదు అంటూ ఫైర్ అయ్యారు.

 

Also Read : AP : చంద్రబాబును అప్పుడు కాపాడింది ఆ వెంకన్నే ..ఇప్పుడు కాపాడేది ఆ వెంకన్నే – దర్శకేంద్రుడు

  Last Updated: 13 Sep 2023, 07:32 PM IST