Site icon HashtagU Telugu

TDP vs YCP : ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల స‌వాల్‌ను స్వీక‌రించిన టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య.. స్కిల్ స్కాంలో ..?

TDP

TDP

స్కిల్ కేసులో చంద్ర‌బాబు నాయుడు అవినీతికి పాల్ప‌డ‌లేదని ఎవ‌రైనా నిరూపిస్తారా అన్న స‌జ్జ‌ల రామకృష్ణ‌రెడ్డి స‌వాల్‌ను టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య స్వీక‌రించారు. సజ్జల రామకృష్ణారెడ్డి విసిరిన ఛాలెంజ్ ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తాను స్వీకరిస్తున్నానని ప్ర‌క‌టించారు. బహిరంగ చర్చ ఎప్పుడు పెడతారో సజ్జల వెంటనే ప్రకటించాలని వ‌ర్ల రామ‌య్య తెలిపారు. చంద్రబాబును ఎత్తేసిన సంగతి నాకు తెలియదు, నేను లండన్ లో ఉన్నానని జగన్ చెప్పడం పెద్ద అబద్ధమ‌ని వ‌ర్ల రామయ్య అన్నారు. ఆరోజు లండన్ నుండి డీఐజీ రఘురామిరెడ్డి, సీఐడీ ఛీఫ్ సంజయ్, ప్రభుత్వ సలహాదారుడు సజ్జలతో వీడియో కాన్ఫరెన్స్ లో జగన్ మాట్లాడింది నిజంకాదా? అని ప్ర‌శ్నించారు. ఈ రకంగా చంద్రబాబును అరెస్టు చేస్తే.. జగన్ 43 వేల కోట్ల దోపిడీని వైఎస్ సహకరించినందుకు ఆయనకు ఎంతకాలం శిక్ష పడాలి? అని ప్ర‌శ్నించారు. 17ఏ సెక్షన్ ప్రకారం చంద్రబాబుపై కేసే ఉండదంటే.. ఇంక కేసును నిరూపించాల్సిన అవసరమేముందని వ‌ర్ల రామ‌య్య ప్ర‌శ్నించారు.

We’re now on WhatsApp. Click to Join.

చంద్రబాబును జైలుకు పంపి జగన్ రాక్షసానందం పొందుతున్నారని.. 11 ఏళ్ల నుండి వ్యవస్థలను మేనేజ్ చేసి కోర్టు నుండి తప్పించుకు తిరుగుతున్న జగన్.. కోర్టు విచారణ చేస్తే తన శేష జీవితమంతా జైల్లోనే గడపాల్సి వస్తుందన్నారు. అవినీతి రహితుడైన చంద్రబాబు ను అక్రమంగా అరెస్టు చేశారని.. జ‌గ‌న్‌ అవినీతి ఎప్పుడో బట్టబయలైందన్నారు. జగన్ తన పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వ వైఫల్యాలనుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు జగన్ స్కిల్ కేసును తెరపైకి తెచ్చారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక అవినీతి పరులను వదలమ‌ని.. ప్రస్తుతం చంద్రబాబు ను ఉంచిన బ్యారెక్ లోనే జగన్ ను పెడతామని వ‌ర్ల రామ‌య్య హెచ్చ‌రించారు.

Also Read:  Angallu Case: అంగల్లు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ రిజర్వ్