Site icon HashtagU Telugu

Varahi Yatra 4th Schedule : అక్టోబర్‌ 1 నుంచి పవన్ నాల్గో విడత వారాహి యాత్ర

Pawan Varahi Yatra 4

Pawan Varahi Yatra 4

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరోసారి ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. ఇప్పటికే మూడు విడతల్లో వారాహి యాత్ర (Varahi Yatra ) ను పూర్తి చేసిన పవన్..ఇప్పుడు నాల్గో విడతకు సిద్ధమయ్యారు. అక్టోబర్ 1 నుంచి నాల్గో విడత (Varahi Yatra 4th Schedule) యాత్రను కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి ప్రారంభించనున్నారు. ఈసారి యాత్ర మచిలీపట్నం, పెడన, కైకలూరు మీదుగా సాగనుంది. ఈ మేరకు జనసేన రూట్ మ్యాప్ రెడీ చేస్తోంది.

ఈ మూడో విడత యాత్ర మరింత రంజుగా ఉండబోతుందని అర్ధం అవుతుంది. మొదటి మూడు విడతలు వైసీపీ పార్టీ ని టార్గెట్ చేసిన పవన్..ఇప్పుడు నాల్గో విడతలో చంద్రబాబు (Chandrababu ) ను అక్రమంగా అరెస్ట్ చేసిందని , రాబోయే ఎన్నికల్లో టీడిపి – జనసేన కలిసి పోటీ చేయబోతోందని..పోటీ చేయడానికి కారణాలు కూడా పవన్ చెప్పబోతున్నట్లు తెలుస్తుంది.

Read Also : Trump Vs Biden : మళ్లీ ట్రంప్ గెలుస్తాడంట.. సంచలన సర్వే రిపోర్ట్

అలాగే ఈసారి ప్రజలు ఎక్కువ సంఖ్యలో యాత్ర లో పాల్గొనడం ఖాయంగా కనిపిస్తుంది. మొన్నటి వరకు జనసేన శ్రేణులు అభిమానులు మాత్రమే యాత్రకు హాజరయ్యారు. కానీ ఇప్పుడు టీడీపీ – జనసేన ఒకటి కావడం తో వారు కూడా పెద్ద సంఖ్యలో యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబుఅరెస్ట్ తర్వాత పోలీసులు కఠిన నింబధనలు విధిస్తున్నారు. కనీసం తెలంగాణ నుండి కూడా ఎవర్ని రానివ్వడం లేని పరిస్థితి ఉంది. ఈ తరుణంలో పోలీసులు పవన్ యాత్ర కు ఎలాంటి ఆటంకాలు సృష్టిస్తారో..ఏంటో అనేది చూడాలి.

మరోపక్క చంద్రబాబు ఇప్పట్లో బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా ఏసీబీ కోర్ట్ మరికొన్ని రోజులు పొడిగించడం..పలు కేసుల ఫై ఇంకా విచారణ కొనసాగుతుండడం తో బాబు బయటకు వచ్చేనా అని అంత మాట్లాడుకుంటున్నారు. అందుకే పవన్ తన దూకుడు ను పెంచాలని చూస్తున్నాడు.