Varahi: మూడు పార్టీల ‘ముచ్చట’ లో ‘వారాహి’

తెలుగు రాష్ట్రాలపై మూడు పార్టీలు ముచ్చటగా సామాన్యుడికి అంతుబట్టని రాజకీయ గేమ్ ఆడుతున్నాయి. పరస్పర అవసరాలు తీర్చుకోవడానికి బీ ఆర్ ఎస్, వైసీపీ, బీజేపీ తెర..

  • Written By:
  • Updated On - March 31, 2023 / 12:25 PM IST

Varahi : తెలుగు రాష్ట్రాలపై మూడు పార్టీలు ముచ్చటగా సామాన్యుడికి అంతుబట్టని రాజకీయ గేమ్ ఆడుతున్నాయి. పరస్పర అవసరాలు తీర్చుకోవడానికి బీ ఆర్ ఎస్, వైసీపీ, బీజేపీ తెర వెనుక నీచ రాజకీయం చేస్తున్నాయని ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న ఆరోపణల దిశగా వాళ్ళ కదలికలు కనిపిస్తున్నాయి. ములాల్లోకి వెళ్లకుండానే జగన్ , పవన్ ఇద్దరూ కేసీఆర్ ఏది చెపితే అది చేస్తారని చెప్పొచ్చు. దానికి కారణం హైదరాబాద్ కేంద్రంగా ఆస్తులు, అంతస్తులు , కేసులు వెరసి దాసోహం. ఇక లిక్కర్ స్కామ్ తరువాత కేసీఆర్ ఢిల్లీ లైజనింగ్ అందరికి తెలిసిందే. ఆ క్రమంలో వారాహి (Varahi) ఇప్పట్లో ఏపీలో కనిపించదు. వస్తేగిస్తే, ఈ సమ్మర్ తరువాత అంటే ఆగస్టు నుంచి వారాహి జనంలోకి రావాలని చూస్తున్నారు. అదే జరిగితే ఏపీలో యాంటీ వైసీపీ వాతావరణాన్ని తన వైపు లాగేయగలరని వైసీపీ ఆలోచన. అందుకే వారాహి (Varahi) మీద పవన్ బయల్దేరి జనంలో పెద్దగా తిరగకుండానే ఎన్నికలు ఏపీలో జరిపించేసుకుంటే తమ కధ సుఖాంతం అవుతుంది అన్నదే వైసీపీ ప్లాన్ అంటున్నారు.

Also Read : Varahi Service Center: ‘వారాహి’ సర్వీస్ సెంటర్ విజయవాడ

ఇంకో విషయం ఏంటి అంటే బీ ఆర్ ఎస్ ఏపీలో పోటీకి రెడీ అవుతోంది. కెసిఆర్ ఏపీకి వచ్చి వైసీపీ మీద గట్టిగా సౌండ్ చేస్తే అది ఆయనకు బెనిఫిట్ ఎంతవరకూ అవుతుందో తెలియదు. తెలంగాణాతో పాటే ఏపీలో ఎన్నికలు రెడీ అయితే మేలు అన్నదే జగన్ వ్యూహం అంటున్నారు. ఇక వైసీపీలో ఉన్న ప్రస్తుత పరిస్థితి. ఇప్పటికైతే నలుగురు ఎమ్మెల్యేలు బయట పడ్డారు. మరింతమందికి కూడా అసంతృప్తి ఉందని అంటున్నారు. ఇలా రోజు కొకరు పూటకొకరు బయటకు వచ్చి సౌండ్ చేస్తూ పోతే అంతిమంగా పార్టీకి డ్యామేజ్ చేసే అవకాశం ఉదని వైసీపీ యోచిస్తోంది. సస్పెండ్ అయిన వారు ఏడాది పాటు నిక్షేపంగా ఎమ్మెల్యే గిరి అనుభవించకూడదు అంటే ఎన్నికలకు వెళ్లడమే మేలు అన్నదే వైసీపీ ప్లాన్.అందుకే అసెంబ్లీని రద్దు చేసి పారేస్తే అంతా మాజీలు అయిపోతారు అన్నదే అసలైన ఎత్తుగడగా ఉందిట. సో అనేక కారణాలతో ముందస్తుకు వైసీపీ వెళ్ళడానికి రెడీ అవుతోందని టాక్. తాజాగా అమిత్ షా తో అర్ధరాత్రి మంతనాల తరువాత జగన్ కి అనుకూలమైన సమాచారం వచ్చిందా అన్నదే చర్చగా ఉంది. ఢిల్లీలో మరుసటి రోజు కూడా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ని జగన్ కలవడం బట్టి చూస్తూంటే ఆయనకు ఆశలు కలిగించే విధంగానే ఈ టూర్ సాగిందని అంటున్నారు.

Also Read : Janasena : మ‌చిలీప‌ట్నం స‌భ‌పై`సువేరా`క‌థ‌నం వైర‌ల్

షా తో భేటీ సుమారు నలభై అయిదు నిముషాల పాటు సాగిందని అంటున్నారు. ఈ భేటీ సందర్భంగా ఏపీ రాజకీయాల గురించి అమిత్ షా ఆరా తీసినట్లుగా చెబుతున్నారు. ఇక జగన్ ముందస్తు ఎన్నికల గురించే చర్చించి ఉంటారని అంటున్నారు. ఏపీలో డిసెంబర్ లో ఎన్నికలు జరిగేలా స్కెచ్ గీశారని సర్వత్రా వినిపిస్తుంది.

డిసెంబర్ లో ఎన్నికలు అంటే తెలంగాణాలో ఎన్నికలతో అన్న మాట. అంటే కెసిఆర్ తో కలసి జగన్ అడుగులు వేస్తారు. ముందస్తు ఎన్నికల కోసమే కేంద్రం అనుమతి కోసం వారి మనసులోని మాటను తెలుసుకునేందుకు జగన్ రెండు సార్లు వరసబెట్టి ఇటీవల ఢిల్లీ వెళ్లారని గుసగుసలు.

అపరచాణక్యుడు చంద్రబాబు సైతం నవంబర్ లో ఏపీలో ఎన్నికలు వస్తాయని తన పార్టీ వారికి చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అంటే బాబుకు కూడా దీని మీద ఒక బలమైన సోర్స్ నుంచే మ్యాటర్ వచ్చిందని అంటున్నారు. ఆరు నెలల అధికారాన్ని వదులుకుని ముందుకు వచ్చి ఎన్నికలు పెడితే జగన్ కి వచ్చిన లాభం ఏంటి అంటే ఇప్పడు ఏపీలో ఎన్నికలు పెడితే వైసీపీకి బొటాబొటీగా సీట్లు అధికారానికి సరిపడా వస్తాయని సర్వేలు చెబుతున్నాయట.

అంటే వంద సీట్లు దాకా రావచ్చు అని అంటున్నారు. అదే 2024 మే లో ఎన్నికలు అంటే షెడ్యూల్ ప్రకారం కనుక వెళ్తే కచ్చితంగా సీన్ రివర్స్ అవుతుంది అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే తెలంగాణాలో ముందుగా ఎన్నికలు జరిగితే ఆ ప్రభావం ఏపీ మీద ఉంటుంది. తెలంగాణా ఎన్నికల విషయంలో బీజేపీ తెలుగుదేశంతో పొత్తులు పెట్టుకుంటే ఏపీలో కూడా అది కంటిన్యూ అవుతుంది.

అదే జరిగితే జనసేన బీజేపీ టీడీపీ కలసి 2014 మాదిరిగా పోటీ చేస్తాయి. ఫలితాలు కూడా సేం టూ సేం అలాగే వస్తాయని ఒక అంచనా ఉంది. దాంతో ఆ కలయిక అసలు వద్దు అన్నదే వైసీపీ ఆలోచన అని చెబుతున్నారు. రెండవ విషయం జనసేన టీడీపీల మధ్య పొత్తులు ఇంకా కుదరలేదు. పవన్ అయితే వరసబెట్టి సినిమాలు చేస్తున్నారు.

Also Read : Janasena : `వారాహి` క‌దిలేది అప్పుడే.! ఆర్భావ స‌భ‌లో జై చంద్ర‌న్న‌ రోడ్ మ్యాప్ ?

పదిహేను రోజుల వ్యవధిలో జగన్ ఢిల్లీకి వెళ్లారంటే అది ముందస్తు ఎన్నికల విషయంలోనే అని రాజకీయ వర్గాలు కోడై కూస్తున్నాయి. జగన్ బుధవారం రాత్రి ఢిల్లీకి సడెన్ ట్రిప్ పెట్టుకున్నారు. ఆయన అమిత్ షా అపాయింట్మెంట్ తీసుకుని అర్ధరాత్రి వేళ కీలక భేటీని నిర్వహించారని చెబుతున్నా దానిలో రాజకీయం ఇమిడి ఉంది. విపక్షం వ్యూహాలను పసిగట్టిన జగన్ నాలుగు ఆకులు ఎక్కువ చదివారు. అందుకే ఆరు నెలల ముందు ఎన్నికలు అంటున్నారని తెలుస్తోంది. వై నాట్ ముందస్తు ఎన్నికలు అన్నదే ఇపుడు జగన్ లో పట్టుదలగా ఉంది అని తోస్తోంది. ఇవన్నీ కేసీఆర్, జగన్ మధ్య సాగుతున్న పొలిటికల్ గమేలో భాగమని తెలుగు ఓటర్లకు కొంత అనుమానం ఉంది. అయితే , కర్ణాటక ఎన్నికల తరువాత బీ ఆర్ ఎస్ , బీజేపీ, వైసీపీ మధ్య నడుస్తున్న చీకటి ముసుగు తొలిగే ఛాన్స్ ఉంది. అప్పటి వరకు వారాహి సినిమా షూటింగ్లో ఉండేలా కేసీఆర్ స్క్రీన్ ప్లే రసారట. ఇదన్నమాట మూడు పార్టీల ముచ్చట.

Also Read:  CM KCR: తెలంగాణలోని 34 అసెంబ్లీ స్థానాలపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్.. అవి ఇవే..!