Varaahi tour : ప‌వ‌న్ వెనుక బీజేపీ కుట్ర‌? టార్గెట్ చంద్ర‌బాబు!

తెలుగుదేశం పార్టీ మీద బీజేపీ(Varaahi tour) కుట్ర ప‌న్నుతోంది. రాబోవు రోజుల్లో ఆ పార్టీ స్థానంలో బ‌ల‌ప‌డాల‌ని వ్యూహాల‌ను ర‌చిస్తోంది.

  • Written By:
  • Publish Date - June 14, 2023 / 01:23 PM IST

తెలుగుదేశం పార్టీ మీద బీజేపీ(Varaahi tour) కుట్ర ప‌న్నుతోంది. రాబోవు రోజుల్లో ఆ పార్టీ స్థానంలో బ‌ల‌ప‌డాల‌ని వ్యూహాల‌ను ర‌చిస్తోంది. ప‌ట్టుమ‌ని రెండు శాతం ఓట్ల‌లేని ఏపీలో కింగ్ మేక‌ర్ కావాల‌ని ఆశ‌ప‌డుతోంది. అంతేకాదు, 2029 నాటికి రాజ్యాధికారం చేజిక్కించుకోవాల‌ని ఉబ‌లాట‌ప‌డుతోంది. అందుకు ప‌వ‌న్ క‌ల్యాణ్ ను పావుగా ఉప‌యోగించుకుంటోంద‌న్న చ‌ర్చ స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ప‌లు రంగాల‌కు చెందిన అగ్ర‌జుల‌ను మ‌హా సంఘ‌ట‌న్ పేరుతో క‌లుస్తూ పావులు క‌దుపుతోంది.

తెలుగుదేశం పార్టీ మీద బీజేపీ కుట్ర(Varaahi tour)

ప్ర‌స్తుతం ఏపీలో తెలుగుదేశం, వైసీపీ నువ్వా? నేనా? అన్న‌ట్టు పోటీప‌డే పార్టీలు. రాజ‌కీయంగా ఏ మాత్రం శూన్య‌త లేకుండా ఏపీని ఆ రెండు భ‌ర్తీ చేశాయి. సామాజిక‌వ‌ర్గం ప‌రంగా హైలెట్ అవుతూ కొద్దిపాటి శూన్య‌త‌ను జ‌న‌సేన (Varaahi tour)చూపిస్తోంది. దాన్ని బేస్ చేసుకుని బీజేపీ జొర‌బ‌డాల‌ని ప్లాన్ చేస్తోంద‌ని వినికిడి. రాజ‌కీయ ఆశ్ర‌యం కోసం బీజేపీ పంచ‌న చేరిన ప‌వ‌న్ ను క‌మ‌ల‌నాథులు వాడేస్తోన్న తీరు సినిమా డైలాగు మాదిరిగా క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల‌కు మాత్రం బీజేపీ, జ‌న‌సేన పొత్తు ఉంద‌ని చెబుతారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో క‌లిసి ఆ పార్టీల నేత‌లు క‌నిపించ‌రు. 2019 ఎన్నిక‌ల త‌రువాత లెఫ్ట్ నుంచి ఒకేసారి రైట్ ట‌ర్న్ ప‌వ‌న్ తీసుకున్నారు. అందొచ్చిన అవ‌కాశాన్ని బీజేపీ వీలున్నంత వ‌ర‌కు ఏపీలో వాడుకుంది. తిరుప‌తి లోక్ స‌భ ఉప ఎన్నిక‌తో మొద‌లు పెట్టి తాజాగా జ‌రుగుతోన్న వారాహి యాత్ర వ‌ర‌కు ప‌వ‌న్ ను వాడేసుకుంటోంది.

ముంద‌స్తు ఎన్నిక‌లంటూ వారాహి  వాహ‌నాన్ని ప‌వ‌న్ ఎక్కారు

సాధార‌ణంగా పొత్తు ఉన్న పార్టీల నేత‌లు ఒకే వేదిక మీద ఎన్నిక‌ల సంద‌ర్భంలో క‌నిపిస్తుంటారు. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల వేడి ఏపీలో పూర్తిగా కనిపిస్తోంది. ముంద‌స్తు ఎన్నిక‌లంటూ వారాహి(Varaahi tour) వాహ‌నాన్ని ప‌వ‌న్ ఎక్కారు. ఆయ‌న అన్న‌వ‌రం నుంచి కాకినాడ వ‌ర‌కు యాత్ర‌ను చేసే షెడ్యూల్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. తొలి షెడ్యూల్ జూన్ 23 వరకు ఖరారైంది. పది రోజులు తొమ్మిది నియోజకవర్గాల‌ను చుట్టేయ‌నున్నారు. బుధ‌వారం అన్నవరం నుంచి కత్తిపూడి‌కి ర్యాలీ‌గా వెళ్లి అక్క‌డ వారాహి విజయ యాత్ర తొలి బహిరంగ సభను ప‌వ‌న్ నిర్వ‌హించ‌నున్నారు.

Also Read : Janasena varaahi : ప‌వ‌న్ `ముంద‌స్తు` మాట! ఏపీ, తెలంగాణ ఎన్నిక‌లు ఒకేసారి..?

అనంతరం పిఠాపురం, కాకినాడ గ్రామీణం, కాకినాడ నగరం, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, నరసాపురం నియోజకవర్గాల మీదుగా యాత్ర ప‌ది రోజుల పాటు కొన‌సాగ‌నుంది. ఈ యాత్ర‌లో ఎక్క‌డా బీజేపీ జెండాలు క‌నిపించ‌వు. ప్ర‌స్తుతం ఆ రెండు పార్టీల మ‌ధ్య పొత్తు ఉంద‌ని ప‌వ‌న్ చెబుతారు. అలాగే, బీజేపీ పెద్ద‌లు కూడా వినిపిస్తుంటారు. ఇలా విచిత్ర‌మైన రీతిలో ఆ రెండు పార్టీల రాజ‌కీయ ప్ర‌చారం ఉంది. ఇటీవ‌ల తిరుప‌తి, విశాఖ‌ప‌ట్నంల‌లో బీజేపీ అధ్య‌క్షుడు న‌డ్డా, హో మంత్రి అమిత్ షా పెట్టిన స‌భ‌ల్లోనూ జ‌న‌సేన జెండా(Varaahi tour) ఎక్క‌డా క‌నిపించ‌లేదు. అంటే, ఆ రెండు పార్టీలు ప్ర‌స్తుతం దోబూలాట ఆడుతున్నాయ‌ని అర్థ‌మ‌వుతోంది.

ఒంట‌రి పోరుకు జ‌న‌సేన  సిద్ధ‌మ‌నే సంకేతం (Varaahi tour)

రాజ‌కీయ వీర‌మ‌ర‌ణం పొందకుండా ఉండేందుకు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాల‌ని ప‌వ‌న్ (Varaahi tour) వ్యూహంగా ఉంది. కానీ, బీజేపీ అందుకు స‌హ‌కారం అందించ‌డంలేదు. దానికి కార‌ణాలు లేక‌పోలేదు. గత నాలుగేళ్లుగా వైసీపీ, బీజేపీ స‌హ‌జ స్నేహాన్ని కొన‌సాగిస్తున్నాయి. ఆ రెండు పార్టీల మ‌ధ్య శ‌తృత్వం ఏర్ప‌డే ప‌రిస్థితి ఉండ‌దు. పైగా వైసీపీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి చెందిన‌ది. అందుకే, తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకును బీజేపీ న‌మ్ముకుంది. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలోని టీడీపీ బ‌లంగా ఉంది. ఆయ‌న్ను బ‌ల‌హీన‌ప‌రిస్తే, బీజేపీ బ‌ల‌ప‌డుతుంద‌న్న ఆశ కమ‌ల‌నాథుల్లో బ‌లంగా ఉంది. అందుకే, చంద్ర‌బాబును వీలున్నంత డ్యామేజ్ చేయ‌డానికి ఉన్న అవ‌కాశాల‌ను బీజేపీ అన్వేషిస్తోంది. అందులో భాగ‌మే, ఒంట‌రి పోరుకు జ‌న‌సేన(Varaahi tour) సిద్ధ‌మ‌నే సంకేతం ప‌వ‌న్ లేటెస్ట్ గా ఇవ్వ‌డం.

Also Read : Pawan Kalyan Yagam: ధర్మ పరిరక్షణ, ప్రజా క్షేమం కోసం ‘పవన్’ యాగం!

ఇవే ఆయ‌న‌కు చివ‌రి ఎన్నిక‌ల‌ని చంద్ర‌బాబు ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. అందుకే, లాస్ట్ ఛాన్స్ అంటూ బ‌హిరంగ స‌భ‌ల్లో చెబుతున్నారు. ఏపీ అభివృద్ధి కోసం 2024 ఎన్నిక‌లు చివ‌రి ఎన్నిక‌ల‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఒక వేళ టీడీపీ అధికారంలోకి రాక‌పోతే ఏపీ భ‌విష్య‌త్ కు కూడా లాస్ట్ ఛాన్స్ అంటూ చెబుతున్నారు. ఇలాంటి మాట‌ల‌ను క‌మ‌ల‌నాథులు అనుకూలంగా మ‌ల‌చుకోవడానికి ప్ర‌య‌త్న‌స్తున్నారు. అందుకే, 2029 ఎన్నిక‌ల నాటికి ఏపీ లో రాజ్యాధికారం అనే టార్గెట్ బీజేపీ పెట్టుకుంది. అందుకు పునాదుల‌ను ప‌వ‌న్ ద్వారా వేసుకుంటూ చంద్ర‌బాబును రాజ‌కీయ నిర్వీర్యం చేయాల‌ని ప్లాన్ చేస్తోంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

Also Read : AP Trend : BJP కి షాక్‌,కామ్రేడ్ల‌తో TDP,JSP కూట‌మి?