టీడీపీకి భారీ షాక్ తగలనుంది. బెజవాడ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న వంగవీటి మోహన రంగా కుమారుడు వంగవీటి రాధా టీడీపీని త్వరలో వీడనున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల ముందు వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చిన వంగవీటి రాధా.. ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్నారు. అయితే ఆయనకు టీడీపీలో టికెట్ దక్కే అవకాశం లేదు. వంగవీటి రాధా విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ ఆ టికెట్‌ను బొండా ఉమాకి టీడీపీ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో రాధాను బందర్ ఎంపీగా పోటీ చేయాలని టీడీపీ కోరినప్పటికి రాధా ఎలాంటి నిర్ణయం చెప్పలేదు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయాలని వంగవీటి రాధా భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా రాధా అడుగులు వేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
వైసీపీలో మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీలతో వంగవీటి రాధకు మంచి స్నేహం ఉంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాధాని పార్టీలోకి తీసుకెళ్లాలని ఇద్దరు మిత్రులు ప్రయత్నాలు చేశారు. అయినప్పటికి రాధా సైలెంట్‌గానే ఉన్నారు. అయితే ఎన్నికలు దగ్గర పడుతుంటంతో రాధా తన రాజకీయ భవిష్యత్‌పై ఆలోచిస్తున్నారు. టీడీపీలో విజయవాడ సెంట్రల్ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు వైసీపీ పెద్దలు రాధాని పార్టీలోకి తీసుకుని విజయవాడ సెంట్రల్ టికెట్ ఇవ్వాలని భావిస్తున్నారు. అందుకోసం ఎంపీ మిథున్ రెడ్డిని పార్టీ రంగంలోకి దింపింది. రాధాతో మిథున్ రెడ్డి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇటు ఆయన సోదరికి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని వైసీపీ అధిష్టానం భావిస్తుంది. కాపుల ఓట్లు లక్ష్యంగానే వైసీపీ పావులు కదుపుతుంది. ఇందులో భాగంగానే వంగవీటి ఫ్యామిలీకి టికెట్లు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. రాధా పార్టీ మారేది లేనిది త్వరలో క్లారిటీ వస్తుంది.
Also Read: Janasena- BJP : జనసేన తో ఎలాంటి పొత్తు ఉండదు..ఫుల్ క్లారిటీ ఇచ్చిన బిజెపి