మాజీ ఎమ్మెల్యే, వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ వివాహాం ఘనంగా జరిగింది. విజయవాడలోని నిడమానూరు మురళి రిసార్ట్స్ లో రాధాకృష్ణ, పుష్పవలి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వివాహానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, గన్నవరం టీడీపీ ఇంఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో పాటు పలువురు రాజకీయ నాయకులు, రంగా అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరైయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకు చెందిన జక్కం బాబ్జి, అమ్మాణి దంపతుల కుమార్తె పుష్పవలితో వంగవీటి రాధాకృష్ణ వివాహం జరిగింది. హైదరాబాద్ లో ఉన్నత విద్యను అభ్యసించిన పుష్పవలి.. కొంతకాలం యోగా టీచర్ గానూ పనిచేశారు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ విద్యా సంస్థలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వంగవీటి రాధాకృష్ణ ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. గతంలో విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు.
Also Read: CBN : తెలుగు ప్రజలకు జైలు నుంచి నారా చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ