Vangaveeti Radha: లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న వంగవీటి రాధా

టీడీపీ యువనేత నారాలోకేష్ యువగళం పాదయాత్ర పీలేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. మంగళవారం ఉదయం కలికిరి ఇందిరమ్మనగర్ విడిది కేంద్రం నుంచి 37వ రోజు యువగళం పాదయాత్ర

  • Written By:
  • Updated On - March 7, 2023 / 04:06 PM IST

టీడీపీ యువనేత నారాలోకేష్ యువగళం పాదయాత్ర పీలేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. మంగళవారం ఉదయం కలికిరి ఇందిరమ్మనగర్ విడిది కేంద్రం నుంచి 37వ రోజు యువగళం పాదయాత్ర ను లోకేష్ ప్రారంభించారు. కలికిరి వద్ద లోకేష్ యువగళం పాదయాత్రకు విజయవాడ టీడీపీ నేత వంగవీటి రాధా (Vangaveeti Radha) సంఘీభావం తెలిపారు. లోకేష్‌తో పాటు వంగవీటి రాధా పాదయాత్ర చేశారు. కాగా టీడీపీ నేతగా ఉన్న వంగవీటి రాధా (Vangaveeti Radha) ఆ పార్టీని వీడుతారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. గత ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన రాధా ఆ పార్టీ తరపున పోటీ చేయకుండా ప్రచారానికే పరిమితం అయ్యారు. ఈ నాలుగేళ్లలో కూడా రాధా ఏ నియోజవర్గంపైనా కూడా దృష్టి పెట్టలేదు. అయితే ఈరోజు టీడీపీ నేత లోకేష్ యువగళం పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ పాదయాత్రలో పాల్గొనడంతో వంగవీటి రాధా టీడీపీని వీడతారనే ప్రచారం ప్రచారంగానే మిగిలిపోనుంది.

టీడీపీ యువనేత నారాలోకేష్ యువగళం పాదయాత్ర పీలేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. మంగళవారం ఉదయం కలికిరి ఇందిరమ్మనగర్ విడిది కేంద్రం నుంచి 37వ రోజు యువగళం పాదయాత్ర ను లోకేష్ ప్రారంభించారు. కలికిరి వద్ద లోకేష్ యువగళం పాదయాత్రకు విజయవాడ టీడీపీ నేత వంగవీటి రాధా సంఘీభావం తెలిపారు. లోకేష్‌తో పాటు వంగవీటి రాధా పాదయాత్ర చేశారు. కాగా టీడీపీ నేతగా ఉన్న వంగవీటి రాధా ఆ పార్టీని వీడుతారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. గత ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన రాధా ఆ పార్టీ తరపున పోటీ చేయకుండా ప్రచారానికే పరిమితం అయ్యారు. ఈ నాలుగేళ్లలో కూడా రాధా ఏ నియోజవర్గంపైనా కూడా దృష్టి పెట్టలేదు. అయితే ఈరోజు టీడీపీ నేత లోకేష్ యువగళం పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ పాదయాత్రలో పాల్గొనడంతో వంగవీటి రాధా టీడీపీని వీడతారనే ప్రచారానికి బ్రేక్ పడింది.

Also Read:  Manchu: పొలిటికల్ సిస్టర్స్ కు ‘మంచు’ తోడు! టీడీపీ లేదా జనసేన వేదిక రెడీ!!