Vangaveeti Radhakrishna : వైసీపీ లో చేరడం ఫై వంగవీటి రాధాకృష్ణ క్లారిటీ..ఇది చాలు కదా ..!!

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీలలో వలసల పర్వం నడుస్తుంది. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ నుండి పెద్ద ఎత్తున నేతలు బయటకు వస్తు..టిడిపి లేదా జనసేన పార్టీలలో చేరుతున్నారు. ప్పటికే పలువురు చేరగా…వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radhakrishna) సైతం టిడిపి నుండి బయటకు రాబోతున్నారని..త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. రాధను వైసీపీ లో చేర్పించే బాధ్యత కొడాలి నాని, వంశీ వల్లభనేని తీసుకున్నారని..ఇప్పటికే వీరిద్దరి రాధతో […]

Published By: HashtagU Telugu Desk
Radha Clarty

Radha Clarty

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీలలో వలసల పర్వం నడుస్తుంది. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ నుండి పెద్ద ఎత్తున నేతలు బయటకు వస్తు..టిడిపి లేదా జనసేన పార్టీలలో చేరుతున్నారు. ప్పటికే పలువురు చేరగా…వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radhakrishna) సైతం టిడిపి నుండి బయటకు రాబోతున్నారని..త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. రాధను వైసీపీ లో చేర్పించే బాధ్యత కొడాలి నాని, వంశీ వల్లభనేని తీసుకున్నారని..ఇప్పటికే వీరిద్దరి రాధతో మాట్లాడడం జరిగిందని ఇలా ఎవరికీ వారు ప్రచారం మొదలుపెట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

గతంలో వైసీపీలోనే ఉన్న వంగవీటి రాధాకృష్ణ గత ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. వైసీపీలో సీఎం జగన్ తనను అవమానించారని మండిపడ్డారు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు కానీ పోటీ చేయలేదు. ఈ సారి కూడా ఆయన పోటీ చేసే స్థానంపై క్లారిటీ లేదు. వైసీపీలో ఉన్న మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఇద్దరూ వంగవీటి రాధాకృష్ణకు మిత్రులు. ఇటీవల కొడాలి నానితో కలిసి కాశీలో కూడా పర్యటించి వచ్చారు రాధా. దీంతో రాధ నిజంగానే వైసీపీ లో చేరతారు కావొచ్చు అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. రోజు రోజుకు ఈ ప్రచారం ఎక్కువ అవుతుండడం తో రాధాకృష్ణ క్లారిటీ ఇచ్చారు. కొడాలి నానితో వ్యక్తిగత స్నేహం మాత్రమే ఉందని రాజకీయాలకు సంబంధం లేదని .. రాజకీయంగా తాను టీడీపీ పార్టీలోనే ఉంటానని.. గతంలో తనను ఎంతో అవమానించిన పార్టీలోకి వెళ్లేది లేదని వంగవీటి క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం.

Read Also : Naa Saami Ranga : ‘నా సామిరంగ’ కు కలిసొచ్చిన కనుమ

  Last Updated: 17 Jan 2024, 04:02 PM IST