AP Cabinet 2024: ఏపీ కేబినెట్‌లో అతి పిన్న వయస్కురాలిగ వంగలపూడి అనిత

పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత (40) చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో అత్యంత పిన్న వయస్కురాలు. ఆమె తర్వాత నారా లోకేష్ (41), కొండపల్లి శ్రీనివాస్ (42), త్రిదల్లి రామప్రసాద్ రెడ్డి (42) ఉన్నారు.

AP Cabinet 2024: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి సీఎం అయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ తదితరులతో సహా పలువురు బీజేపీ అగ్రనేతలు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో సహా 24 మంది ఎమ్మెల్యేలు ఈరోజు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 17 మంది మంత్రులు కొత్తవారే కావడం విశేషం. చంద్రబాబు మంత్రివర్గంలో ముగ్గురు మహిళలు, ఎనిమిది మంది వెనుకబడిన తరగతుల నాయకులు, ఇద్దరు ఎస్సీలు, ఒక ఎస్టీ, ఒక ముస్లిం ఉన్నారు.

పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత (40) చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో అత్యంత పిన్న వయస్కురాలు. ఆమె తర్వాత నారా లోకేష్ (41), కొండపల్లి శ్రీనివాస్ (42), త్రిదల్లి రామప్రసాద్ రెడ్డి (42) ఉన్నారు. 70 ఏళ్ళు దాటిన వారిలో ఎన్‌ఎండి ఫరూక్ (75), చంద్రబాబు నాయుడు (74), ఆనం రామనారాయణ రెడ్డి (71) ఉన్నారు.

అనిత తండ్రి అప్పారావు. ఆమె ఆంధ్రా యూనివర్సిటీ 2009 సాహిత్యంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ చేశారు. 2011లో మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంబేద్కర్ యూనివర్సిటీలో పూర్తి చేసింది. ఆమె రాజకీయాలకు ముందు పూర్వ విశాఖపట్నం జిల్లా రాజవరంలో ఉపాధ్యాయురాలిగా పని చేసింది. 2014 ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలుగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో కొవ్వూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2024లో పాయకరావుపేటలో కూటమి అభ్యర్థిగా పోటీ చేసి కంబాల జోగులుపై 43,737 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

Also Read: Chandrababu Oath Ceremony: సీఎంగా చంద్రబాబు.. అమరావతి రైతుల కళ్ళల్లో ఆనందం