Site icon HashtagU Telugu

RK Roja : మహానటి రోజా.. ఆ వీడియోలు ఒకసారి చూసి మాట్లాడు – వంగలపూడి అనిత

Anitha Roja

Anitha Roja

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి…తనను అనరాని మాటలు అన్నాడని, ఓ మహిళకు రాష్ట్రంలో ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ..మంత్రి రోజా (Minister Roja) మీడియా ముందు కన్నీరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత (TDP Telugu Mahila President Vangalapudi Anitha)..రోజా కన్నీరు పెట్టడం ఫై చివాట్లు పెట్టింది. మహానటి రోజా కార్చిన కన్నీరంతా డ్రామా అని.. అన్నీ గ్లిజరిన్ ఏడుపులేనని అనిత అన్నారు.

రోజా తన పూర్వ వీడియోలు ఒకసారి చూడాలని.. అప్పుడు ఆమె ఏం మాట్లాడిందో తెలుస్తుందన్నారు. ఆడదానివన్న సంగతి ఇప్పుడు గుర్తొచ్చిందా? అని రోజాను ప్రశ్నించారు. నా గురించి నువ్వు చాలా నీచంగా చాలాసార్లు మాట్లాడవు. అంత కన్నా నీచంగా బండారు మాట్లాడారా? నేను ఎన్నో కేసులు పెట్టినా పోలీసులు స్పందించలేదు. ఇపుడు చీటికీ మాటికి మాపై కేసులు పెడుతున్నారు. బ్రాహ్మణి గారికి జడలుకు వేశానని చెప్పావు.. ఇప్పుడు విమర్శలా? భువనేశ్వరి కాళ్ళు పట్టుకోలేదా? భువనేశ్వరిపై విమర్శలు చేస్తున్నపుడు.. నువ్వు నవ్విన నవ్వు మేము ఎప్పుడూ మర్చిపోము. బాబు జైలుకు వెళ్ళినప్పుడు స్వీట్లు పంచుకుంటావా? రోజా.. నీకు రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీయే. బాబుని కామ సిఎం అని రోజా మాట్లాడలేదా? భువనేశ్వరి, బ్రాహ్మణి, లోకేష్ మీద అవాకులు చెవాకులు పేలలేదా? రోజా అని అనిత ఫైర్ అయ్యారు.

‘‘రాష్ట్రంలో ఆడ పిల్లలు మాన ప్రాణాలు పోతున్నా ఎవరూ స్పందించలేదు. ప్రతిపక్షంలో ఉన్నపుడు రోజా మద్యం బాటిల్స్ బద్దలు కొట్టింది. ఇపుడు ఏరులై పారుతున్నా ఎందుకు స్పందించడం లేదు? సామాజిక మాధ్యమాల్లో ఉన్న విషయాన్ని బండారు సత్యనారాయణ మాట్లాడారు..అందులో ఏ తప్పు ఉంది..? నువ్వు మాట్లాడినప్పుడు తప్పు కనిపించలేదా..? ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి దొంగ ఏడుపు ఏడుస్తున్నావు అంటూ అనిత..రోజా ఫై రెచ్చిపోయారు.

We’re now on WhatsApp. Click to Join.

గత మూడు రోజులుగా మంత్రి రోజా – బండారు సత్యనారాయణ (Bandaru Satyanarayana Murthy) వ్యవహారం మీడియా లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రోజా ఫై టీడీపీ నేత , మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అనుచిత వ్యాఖ్యలు చేసారని చెప్పి ఆయన్ను అరెస్ట్ చేసారు. ఇదే మంత్రి రోజా..చంద్రబాబు , లోకేష్ , బ్రహ్మణి , భువనేశ్వరి లను ఎన్ని మాటలు అన్నంది..అసెంబ్లీ లో ఎలా ప్రవర్తించిందో తెలియదా అంటూ టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. ప్రస్తుతం మీడియా లో దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది.

Read Also : AP Inner Ring Road Case : మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేస్తారా..?