పిఠాపురం (Pithapuram)లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) 60 నుండి 90 వేల మెజార్టీ తో విజయం సాదించబోతున్నారని వైసీపీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత (Vanga Geetha) చెప్పడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఏపీలో ఎన్నికల సమరం ఏ రేంజ్ లో జరిగిందో చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఓటు వేసేందుకు ఓటర్లు పోటెత్తడం తో అన్ని రాజకీయ పార్టీల్లో టెన్షన్ గా ఉంది. ఓటర్లు ఎవరికీ మద్దతు తెలిపారో అని ఆలోచిస్తూ..గెలుపు ఫై ఓవరీకి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరుణంలో బెట్టింగ్ లు కూడా భారీ మొత్తంలో జరుగుతున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
ముఖ్యంగా పిఠాపురం పైనే అందరి చూపు..ఇక్కడ జనసేన నుండి పవన్ కళ్యాణ్ , వైసీపీ నుండి వంగా గీత బరిలో నిల్చున్నారు. ఇక్కడ కూడా భారీ ఎత్తున పోలింగ్ జరగడంతో ప్రజలు ఎవర్ని కోరుకుంటున్నారో అని కొంతమంది మాట్లాడుకుంటుంటే…చాలామంది మాత్రం పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జనసేన శ్రేణులు , కూటమి నేతలు , కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గెలుస్తాడని ధీమా వ్యక్తం చేయడంలో అతిశయోక్తి లేదు కానీ వైసీపీ అభ్యర్థి వంగా గీత సైతం పవన్ కళ్యాణే గెలుస్తాడని , అది కూడా 90 వేల మెజార్టీ తో విజయం సాదించబోతున్నారని చెపుతుండడం షాక్ ఇస్తుంది. దీనికి సంబదించిన ఆడియో టేప్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇందులో పవన్‌పై ఆమె ప్రశంసల వర్షం కురిపించింది. ఆయనొక సెలబ్రెటీ అని, ఒక పార్టీకి ప్రెసిడెంట్ అని చెబుతూ పవన్ కోసం అందరూ వచ్చి ప్రచారం చేశారని గీత అన్నారు. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కు 80 వేల నుంచి 90 వేల మెజారిటీ వచ్చే అవకాశం ఉందని ఆమె వ్యాఖ్యానించారు.
దీనిని పవన్ , జనసేన అభిమానులు షేర్ చేస్తూ వైసీపీపై కామెంట్స్ పెడుతున్నారు. వంగా గీత చేతులెత్తేశారని, ఆ పార్టీ నేతలు తూర్పు తిరిగి దండం పెట్టుకోండి అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే దీనికి వైసీపీ నుంచి కూడా గట్టిగానే కౌంటర్లు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్‌కు 80 నుంచి 90 వేల ఓట్లు మాత్రమే వస్తాయని వంగా గీత చెప్పారు తప్పించి అది మెజారిటీ కాదన్నారు. ఏది ఏమైనప్పటికి వంగా గీత ఇలా మాట్లాడేసరికి వైసీపీ శ్రేణులు తట్టుకోలేకపోతున్నారు.
Read Also ; Kalki 2898 AD : మీరు ఇది గమనించారా.. బుజ్జిగాడు డేట్‌లోనే బుజ్జి ఎంట్రీ..