వైసీపీ నాయకుడు, జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన అరాచకాలకు అంతం లేదు. మైనింగ్ అక్రమాలు, మహిళలపై దాడులు, అధికారం మాటున అన్ని నేరాలు చేసిన వల్లభనేని వంశీ ఇంతకాలం తప్పించుకు తిరిగాడు. ఇప్పుడు పాపం పండింది. గతంలో చేసిన నేరం నుండి తప్పించుకోవడానికి మరో నేరం చేయడం వైసీపీ నేతలకు అలవాటు. అదే విధంగా, వల్లభనేని వంశీ ఒక నేరం నుంచి తప్పించుకోవడానికి మరో ఘోరమైన నేరం చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.
కర్మ ఎలా కాలింది?
గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి కేసు నుంచి తప్పించుకోవడానికి, అక్కడ పనిచేసే ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి, చంపేస్తానని బెదిరించి, అఫిడవిట్ ఇప్పించి వంశీ అడ్డంగా దొరికిపోయాడు. ఆదరించి అంతటివాడిని చేసిన అమ్మలాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై, అమ్మ పాలు తాగి రొమ్ము మీద గుద్దినట్లు, వైకాపాలో చేరాక సైకోలెక్కన మారిన వంశీ నేర సామ్రాజ్యంలో ఈ దాడి కేవలం ఒక చిన్న అంశమే. అంతకు మించిన నేరాలు చేసిన ఘనుడు వల్లభనేని వంశీ.
నేరాల సామ్రాజ్యం:
గన్నవరం నియోజకవర్గంలో వంశీ నేతృత్వంలో వైసీపీ పాలనలో ప్రతి రోజు గొడవలు, దౌర్జన్యాలు, అక్రమాలు యథేచ్ఛగా జరిగాయి. గన్నవరం నియోజకవర్గంలో గత ఐదేళ్లలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ జరిగినట్లు ఇప్పటికే విజిలెన్స్ విచారణలో వెల్లడైంది. గన్నవరంలో నాటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన వద్ద పనిచేసే కూలీలు, డ్రైవర్ల పేరుతో దరఖాస్తులు పెట్టి ఇష్టానుసారం తవ్వకాలు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఐదేళ్ల పాటు కొండలు, గుట్టలు, పోలవరం కట్టలను కొల్లగొట్టారు. గోరంత అనుమతులు తీసుకుని కొండలన్నీ పిండి చేశారు. గన్నవరంలో ఇష్టానుసారం తవ్వకాలు జరిపారని, దీనిపై విచారణ జరుగుతోందని, చర్యలు తప్పక ఉంటాయని ఇటీవల శాసనసభలో మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ముఖ్యంగా గన్నవరం, ఆగిరిపల్లి రోడ్డులో ఈ అక్రమాలు ఎక్కువగా జరిగాయని, రేమల్లె సహా పరిసర ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో గ్రావెల్ తవ్వకాలు జరిపినట్టు గుర్తించారు.
రూ. 100 కోట్ల అక్రమ మైనింగ్:
అక్రమంగా తవ్విన మట్టి విలువ సుమారు రూ. 100 కోట్లు ఉండొచ్చని అధికారులు అంచనా వేసారు. అక్రమ తవ్వకాలపై వంశీతో పాటు అతని ప్రధాన అనుచరులపై విజిలెన్స్ కేసులు నమోదు చేయనున్నారు. దీనికి సంబంధించి పలువురు కీలక వ్యక్తులను విచారిస్తున్నారు. త్వరలోనే వంశీని కూడా విచారించే అవకాశం ఉంది. గన్నవరం విమానాశ్రయ భూముల్లో కూడా వంశీ అక్రమాలకు పాల్పడినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.
సంకల్ప సిద్ధి స్కామ్:
సంకల్ప సిద్ధి పేరుతో మనీ సర్క్యులేషన్ స్కీం లో వంశీ గ్యాంగ్ కోట్లు కొల్లగొట్టింది. ఆ డబ్బులు పోగేసుకొని, మాజీ మంత్రి కొడాలి నానితో కలసి వంశీ బెంగళూరులో ఆస్తులు కొనుగోలు చేశాడు.
కోపరేటివ్ సొసైటీల దోపిడీ:
వైసీపీ ప్రభుత్వంలో గన్నవరం ప్రాంతంలోని సహకార సొసైటీల్లో అనేక అక్రమాలు జరిగాయి. కోపరేటివ్ సొసైటీలను స్వతంత్రంగానే ఉంచాలని, ప్రతి రెండేళ్లకోసారి ఆడిట్‌ను తప్పనిసరి చేయాలని నిబంధన ఉన్నా వంశీ పట్టించుకోలేదు. తన అనుయాయులకు వాటి ద్వారా దోచిపెట్టాడు. అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చి, అందులో ఉద్యోగాల స్కామ్ కూడా వంశీ చేశాడు.
అమానుష దాడులు – అక్రమ కేసులు:
తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పై పాశవికంగా దాడి చేయడమే కాకుండా ఆయనపైనా వందల మంది టీడీపీ కార్యకర్తల పైనా అక్రమ కేసులు పెట్టించాడు. జగన్ అవినీతిని ప్రశ్నించిన ఎన్నారై డాక్టర్ లోకేష్ కుమార్ ని గన్నవరం ఎయిర్ పోర్టులో వంశీ గ్యాంగ్ కిడ్నాప్ చేసి, దాడి చేసింది. పోలీసులం అని చెప్పి, డాక్టర్ లోకేష్ కుమార్ ని కిడ్నాప్ చేసి అమానుషంగా ప్రవర్తించారు. గన్నవరం వంశీ గూండాలు తెలుగుదేశం నాయకుడు దొంతు చిన్న ఇంటిపై దాడి చేశారు. చిన్న ఇంట్లో లేకపోవడంతో ఆయన భార్య పట్ల అనుచితంగా ప్రవర్తించారు. గన్నవరంలో వైసీపీ నాయకులు ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై సీ-విజిల్ యాప్ లో ఫిర్యాదు చేసినందుకు టీడీపీ నాయకురాలు, ప్రస్తుత కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి, ఆమె కుమార్తెపై వంశీ గ్యాంగ్ దాడి చేసింది.
అభివృద్ధికి అడ్డుపడే రాక్షసుడు:
అశోక్ లేల్యాండ్ కంపెనీ మూతకు కారణం వంశీనే. మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ నాశనం చేశాడు. వంశీ దుర్మార్గానికి భయపడి మేధా ఐటి టవర్స్ ఖాళీగా ఉండిపోయాయి.
క్యాసినో సంస్కృతి:
గన్నవరం ప్రాంతంలో క్యాసినో సంస్కృతి తీసుకువచ్చి, వంశీ కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించాడు.
ఎంత సైకో అంటే:
ప్రతిపక్ష నేత జూం కాల్లో బాధితులతో మాట్లాడుతుంటే.. తన అనుచరురాలిని అందులోకి చొప్పించి వాగించి ఆనందించే వాడు. మాడాగాడు, మేకకు కూడా గడ్డం వస్తుంది నుండి వీడి బాష మామూలుగా వుండేది కాదు. పరస్త్రీల పొందులో వీడియోలు తీయించుకొన్న నీచుడు.
ఇప్పుడు పాపం పండింది:
ఓడిపోగానే.. అమెరికా గట్రాలకు వెళ్లి తప్పించుకుంటూ.. కోర్టులలో బెయిల్ తెచ్చుకొంటూ.. మేకపోతు గాంభీర్యంతో కబుర్లు చెబుతూ తిరిగిన వంశీ, తాజాగా నేరం చేసి అడ్డంగా దొరికాడు పోలీసులకు. అతని నేరాల సామ్రాజ్యం కుప్పకూలింది. ఈయన బాధిత మనసుల్లో.. వంశీ భయం ఇంకా అలాగే వుంది. ఈయన నేరాల కథ ఇంకా ముగియలేదు.. ఇంకా చెప్పాల్సినది చాలా ఉంది.