గన్నవరం (Gannavaram) రాజకీయాలు ఆసక్తిగా మారబోతున్నాయా..? వంశీ అరెస్ట్ (Vamsi Arrest) తర్వాత సైలెంట్ గా ఉన్న వైసీపీ (YCP) ఇప్పుడు యాక్టీవ్ కాబోతుందా..? వంశీ రాజకీయ వారసురాలిగా ఆయన భార్య పంకజశ్రీ (Pankaja Sri) రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందా..? ఇప్పుడు ఇదే ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి. పలు కేసుల నడుమ గత కొద్దీ రోజులుగా వంశీ జైల్లోనే ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఆరోగ్యం క్షిణించడం తో కోర్ట్ ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసి హాస్పటల్ లో చేర్పించాలని పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో వంశీ భార్య రాజకీయాల్లోకి రాబోతుందనే వార్త వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపుతుంది. భర్త పట్ల ప్రజల్లో ఉన్న మద్దతును నిలబెట్టుకోవడమే కాకుండా, నియోజకవర్గాన్ని రిప్రెజెంట్ చేయాలనే ఉద్దేశంతో పంకజశ్రీ
రాజకీయ ప్రవేశం చేస్తున్నట్లు తెలుస్తుంది.
Kothagudem : 17 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు రేపు (మే 31) గన్నవరంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై, తదుపరి వ్యూహాలపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే వైసీపీ వర్గాలు జూన్ 4న ‘వెన్నుపోటు దినోత్సవం’ని గన్నవరంలో ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికి వంశీ భార్య రాజకీయాల్లోకి వస్తుందనే అంశం ఇప్పుడు గన్నవరం లో హాట్ టాపిక్ గా మారింది.