విజయవాడ సబ్ జైల్లో ఉన్న వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)తో ఆయన భార్య పంకజశ్రీ (Pankaja Sri) ములాఖత్ అయ్యారు. భర్త ఆరోగ్యం క్షీణించిందని, జైల్లో కఠినంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు ఆరోపణలతో అరెస్టు చేసి, కేసును ఫ్యాబ్రికేట్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. వంశీది నేరం రుజువు కాకుండానే బంధించారని, ఆయన ఆరోగ్యం మెరుగుపడేందుకు కనీస సదుపాయాలు కూడా కల్పించడం లేదని పంకజశ్రీ ఆగ్రహం వ్యక్తం చేసారు. జైలులో తన భర్తను టార్చర్ పెడుతున్నారని, నేలపై పడుకోబెడుతున్నారని ఆమె తన ఆవేదనను వ్యక్తం చేసారు తెలిపారు.
Delhi : ‘శీష్ మహల్’ పై విచారణకు కేంద్రం ఆదేశం
ఇది కక్ష్య రాజకీయ కేసుగా మారిందని, తమ కుటుంబాన్ని మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తన భర్త ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, మెరుగైన చికిత్స అందించాలని ఆమె డిమాండ్ చేశారు. వంశీకి కనీసం మంచం సదుపాయం కూడా కల్పించడం లేదని ఆరోపిస్తూ, ఈ విషయంపై జడ్జిని కోరతామని అన్నారు. ఆమె వ్యాఖ్యలతో వంశీ అరెస్టుపై మరోసారి చర్చ మొదలైంది. అతనిపై కేసు, అరెస్టు తదితర అంశాలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. అధికార పక్షం మాత్రం అన్ని చట్టబద్ధంగా జరుగుతున్నాయని స్పష్టం చేస్తోంది. వంశీ భార్య చేసిన ఆరోపణలతో వంశీ ఆరోగ్య పరిస్థితి, జైలు వాస్తవాలు ఎలా ఉన్నాయనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. పంకజశ్రీ చేసిన ఆరోపణలపై అధికార యంత్రాంగం ఎలా స్పందిస్తుందో చూడాలి. వంశీ అరెస్టు తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో వేడి పెరిగిన సంగతి తెలిసిందే.