గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)కి సుప్రీంకోర్టు నుండి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఆయనపై అక్రమ మైనింగ్ కేసు నమోదై ఉండగా, వంశీ ముందస్తు బెయిల్(Anticipatory bail ) కోసం హైకోర్టును ఆశ్రయించి ఊరట పొందారు. అయితే, ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఇప్పుడు ఆ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ప్రభుత్వ వాదనలు వినకుండా హైకోర్టు బెయిల్ ఇచ్చిందని, అది సరైన తీర్పు కాదని న్యాయస్థానం అభిప్రాయపడింది.
Bathroom Camping’ : ‘బాత్రూమ్ క్యాంపింగ్’..అంటే ఏంటి..? అంత దీని గురించే ఎందుకు మాట్లాడుతున్నారు..?
సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులతో.. వంశీకి మళ్లీ హైకోర్టు ముందు హాజరై తన ముందు బెయిల్ కోసం వినిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ కేసులో మౌలిక విచారణ చేయాల్సిన బాధ్యత హైకోర్టుదేనని, ముందస్తు బెయిల్‌ను పునఃపరిశీలించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ సందర్భంగా సుప్రీం, ఈ కేసుపై తాము ఏ నిర్ణయం తీసుకోవడం లేదని స్పష్టం చేయడం వల్ల వంశీకి తాత్కాలిక ఊరట లభించినట్టు భావిస్తున్నారు.
వంశీ ఇప్పటికే పలు కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్నారు. ఆయన్ను అరెస్ట్ చేసిన అనంతరం విజయవాడ జైలులో ఐదు నెలలు గడిపిన వంశీ ఇటీవలే బెయిలుపై విడుదలయ్యారు. జైలులో ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా సుప్రీం ఇచ్చిన తీర్పుతో వంశీ బెయిల్ వ్యవహారం తిరిగి హైకోర్టులోకి వెళుతుండటంతో, ఈ కేసు మరోసారి రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హైకోర్టు తీసుకునే తదుపరి నిర్ణయం వంశీ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశముంది.