Site icon HashtagU Telugu

Gannavaram : మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్

Vamshi Arrest

Vamshi Arrest

టీడీపీ ఆఫీస్ (TDP) ఫై దాడి కేసులో వైసీపీ సీనియర్ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేడు గన్నవరంలోని ఆయన నివాసం వద్దే అతన్ని అదుపులోకి తీసుకొని గన్నవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా ఇదే కేసులో మరో అనుచరుడు రమేష్ ను గత రాత్రి అరెస్ట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

గన్నవరంలో టీడీపీ ఆఫీస్ ఫై దాడి కేసులో వల్లభనేని వంశీని 71వ ముద్దాయిగా పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో 18మందిని అరెస్ట్ చేసిన పోలీసులు టీడీపీ ఆఫీస్ పై జరిగిన దాడిలో నేరుగా వంశీ పాల్గొనకపోయినా ఎమ్మెల్యే హోదాలో ఆయన ఆదేశాలతోనే వైసీపీ మూకలు దాడిచేసి విధ్వంసం సృష్టించారని కేసు నమోదు చేసారు. హైదరాబాద్ నుంచి వంశీ గన్నవరం వస్తుండగా వాహనాన్ని అనుసరించి అదుపులోకి తీసుకున్నారు. వంశీ ఇంటికి సమీపంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొద్ది సేపట్లోనే ఆయన వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

Read Also : Hyundai Grand I10 : సిఎన్‌జి డ్యుయో ప్రారంభించిన హ్యుందాయ్.. ఈ కారులో ఇప్పుడు చాలా లగేజ్ స్పేస్..!