Site icon HashtagU Telugu

Janasena : మావయ్య కోసం రంగంలోకి దిగిన మెగా మేనల్లుడు

Vishnavtej Janasnea

Vishnavtej Janasnea

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను గెలిపించేందుకు మెగా ఫ్యామిలీ అంత రంగంలోకి దిగుతుంది. ఇప్పటికే చిరంజీవి (Chiranjeevi) సపోర్ట్ చేయగా..వరుణ్ తేజ్ (VarunTej) ప్రచారం చేసి ఆకట్టుకున్నారు..ఈరోజు మరో మెగా హీరో పిఠాపురంలో అడుగుపెట్టారు. దీంతో మెగా అభిమానుల్లో ,జనసేన శ్రేణుల్లో , పార్టీ నేతల్పో జోష్ పెరుగుతుంది. ప్రస్తుతం ఏపీ ఎన్నికలు కాకరేపుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పిఠాపురం పైనే అందరి దృష్టి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుండి పోటీ చేస్తున్నారని తెలిసిన దగ్గరి నుండి వైసీపీ పార్టీ..పవన్ కళ్యాణ్ ఎలాగైనా ఓడించాలని భారీ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున డబ్బు , మద్యం డంప్ చేయగా..వాటితో పవన్ కళ్యాణ్ ఓడించాలని చూస్తున్నారు. కానీ అభిమానులు , పార్టీ శ్రేణులు మాత్రం పవన్ కళ్యాణ్ ను గెలిపించుకుంటాం..అసెంబ్లీ లో అడుగుపెట్టనిస్తాం అంటున్నారు.

ఇదే తరుణంలో పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా చిత్రసీమ కూడా కదిలి వస్తుంది. ఇప్పటికే ఎంతోమంది పిఠాపురంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తుండగా..ఇప్పుడు మెగా హీరో వైష్ణవ్ తేజ్ (Panja Vaisshnav Tej) సైతం ప్రచారంలోకి అడుగుపెట్టారు. పిఠాపురం పాదగయ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన మేనమామకు విజయం చేకూర్చేలా ఆశీస్సులు అందజేయాలంటూ ప్రార్థించారు.

ప్రస్తుతం పవన్ తరఫున నాగబాబు అర్ధాంగి కొణిదెల పద్మ ప్రచారం చేస్తున్నారు. వైష్ణవ్ తేజ్ కూడా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. వైష్ణవ్ తేజ్… గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ లతో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ రోడ్ షో కొండెవరం నుంచి ఉప్పాడ వరకు సాగింది. వీరికి పెద్ద ఎత్తున అభిమానులు ,పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. త్వరలో చిరంజీవి సైతం రాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇలా మెగా ఫ్యామిలీ అంత రంగంలోకి దిగే సరికి వైసీపీ కి ఏంచేయాలో అర్ధం కావట్లే.

Read Also : Lok Sabha Poll : తెలంగాణ లో పోలింగ్ సమయం పొడిగింపు