Ushasri Charan : 50 మంది అనుచరులతో శ్రీవారిని దర్శించుకున్న ఏపీ మంత్రి…భక్తుల ఆగ్రహం..!!

భక్తుల తాకిడితో తిరుమల కొండ కిక్కిరిసిపోతోంది. ప్రతిరోజు దాదాపు 70వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు.

  • Written By:
  • Publish Date - August 15, 2022 / 12:28 PM IST

భక్తుల తాకిడితో తిరుమల కొండ కిక్కిరిసిపోతోంది. ప్రతిరోజు దాదాపు 70వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి చాలా సమయం పడుతుంది. కాగా వీఐపీ వల్ల భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా మంత్రి ఉషశ్రీ చరణ్ తిరుమలలో హల్ చల్ చేశారు. దాదాపు 50మంది అనుచరులతో కలిసి ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. మరో పదిమంది అనుచరులు సుప్రభాతం టికెట్లను పొందారు. దీంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నా మంత్రి ఉషశ్రీ చరణ్ టీటీడీ టికెట్లను జారీ చేసిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నించిన మీడియా ప్రతినిధఉల పట్ల మంత్రి గన్ మెన్లు దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో ఓ వీడియో జర్నలిస్టును తోసేశారు.

కాగా మూడు, నాలుగు రోజులుగా వైకుంఠం కాంప్లెక్సులోని కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోతున్నాయి. శ్రీవారి దర్శనానికి 30గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి ఆరుగంటల సమయం పడుతోంది. నిన్న 92వేల మంది పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.