Site icon HashtagU Telugu

AP : ఏపీ సీఎం వైఎస్ జగన్ తో అమెరికా కాన్సులేట్ జనరల్ భేటీ..!!

Jagan

Jagan

ఏపీ సీఎం వైఎస్ జగన్ తో క్యాంప్ కార్యాలయంలో అమెరికా కాన్సుల్ జనరల్ భేటీ అయ్యారు. బుధవారం తాడేపల్లికి వచ్చిన ఆమె సీఎం క్యాంపు ఆఫీసులో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారిమధ్య పలు అంశాలపై చర్చ జరిగింది. కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాంటూ జగన్ను అభినందించారు. జీడీపీ వృద్ధిలో ఏపీని నెంబర్ వన్ గా నిలబెట్టారని ఆమె కితాబిచ్చారు.

కాగా రాష్ట్రంలో పెట్టుబడులకు సహకారం అందించాలని జెన్నిఫర్ ను ఈ సందర్భంగా సీఎం జగన్ కోరారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అంశాలన్నింటీని ఆమెకు వివరించారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే అమెరికా రాయబార కార్యాలయం చీఫ్ గా ఈ మధ్యే జెన్నిఫర్ నియమితులయ్యారు. తెలంగాణ, ఏపీతోపాటు ఒడిశాలకు సంబంధించిన అమెరికా వ్యవహారాలన్నింటినీ ఆమె పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ తో జెన్నిఫర్ భేటీ అయ్యారు.