ప్రకాశం జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటనకు అపూర్వ స్పందన లభించింది. ఒంగోలు వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరై ఘనస్వాగతం పలికారు. టంగుటూరు టోల్ గేట్ వద్ద ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య ఆధ్వర్యంలో జరిగిన స్వాగత కార్యక్రమం అద్భుతంగా సాగింది. గజమాలలతో, పుష్పగుచ్ఛాలతో, జై తెలుగుదేశం నినాదాలతో మారుమోగిన వాతావరణంలో మంత్రి లోకేష్ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. కందుకూరు నియోజకవర్గం తెట్టు వద్ద ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రజలు, పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని లోకేష్ పై ప్రేమాభిమానాలు వ్యక్తం చేశారు.
Jubilee Hills By Election : నగరవాసులకు కొత్త కష్టాలు
పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరితో సంతోషంగా ఫోటోలు దిగుతూ, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. లోకేష్ పర్యటన సందర్భంగా ప్రాంతీయ ప్రజల్లో ఉత్సాహం నెలకొంది. ఆయనను చూసేందుకు, కలవడానికి ప్రజలు తహతహలాడారు. తమ ప్రాంత అభివృద్ధికి లోకేష్ కృషి చేస్తారని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు.
మరికాసేపట్లో నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతుంది. ముసునూరు టోల్ ప్లాజా వద్ద నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. మంత్రి వెంట టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా ఉన్నారు. దగదర్తిలో రాష్ట్ర ఆగ్రోస్ కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ దివంగత మాలేపాటి సుబ్బానాయుడు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను మంత్రి లోకేష్ పరామర్శించనున్నారు. ఈ పర్యటనతో ప్రాంతీయ టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపిన లోకేష్, ప్రజలతో సాన్నిహిత్యాన్ని మరింత బలోపేతం చేశారు.
