ఏపీలోని అన్నమ్మయ్య జిల్లా మదనపల్లిలో దారుణం జరిగింది. రమేష్ అనే యువకుడిని దుండగులు దారుణంగా నరికి హత్య (MURDER) చేశారు. రమేష్ బైక్ పై వెళ్తుండగా నిందితులు కళ్ళల్లో కారం చల్లి దాడి చేశారు. తల, మొండెం వేరు చేసి చంపారు. స్థానికుల సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బైక్ నెంబర్ ఆధారంగా మృతుడిని రమేష్ గా గుర్తించారు. మృతుని తల కోసం గాలిస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రమేష్ గతంలో ఓ వ్యక్తి హత్య కేసులో నిందితుడిగా ఉన్నట్లు సమాచారం. ఈ హత్యకు ప్రతీకారంగానే రమేష్ హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు ప్రకటించారు. నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు ప్రకటించారు.