Site icon HashtagU Telugu

Vangaveeti Radha : ‘రెక్కీ’ వెనుక పారిశ్రామిక‌వేత్త‌?

Radha Babu

Radha Babu

వంగ‌వీటి రాధా `రెక్కీ` వ్య‌వహారంపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్ర‌బాబునాయుడు ఆల‌స్యంగా స్పందించాడు. ఏపీలోని లా అండ్ ఆర్డ‌ర్ స‌మ‌స్య‌కు ఈ అంశాన్ని ముడివేశాడు. ఆ మేర‌కు ఏపీ డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ కు లేఖ రాయ‌డం స‌రికొత్త రాజ‌కీయానికి నాంది ప‌లుకుతోంది. దీని వెనుక ఎవ‌రున్నారో…తేల్చాలంటూ లేఖ‌లో డిమాండ్ చేశాడు.సాధార‌ణంగా ఏదైన సంఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే మీడియాలో పాపుల‌ర్ లీడ‌ర్లుగా ఎదిగిన వ‌ర్ల రామ‌య్య‌, బుద్ధా వెంక‌న్న ప‌ట్టాభి తెర‌మీద‌కు వ‌స్తారు. పైగా తెలుగుదేశం పార్టీకి చెందిన వంగ‌వీటి రాధా `రెక్కీ` వ్య‌వహారాన్ని నాలుగు రోజుల క్రితం బ‌య‌ట‌పెట్టిన‌ప్ప‌టికీ వాళ్ల‌లో చ‌డీచ‌ప్పుడు లేదు. ఈ అంశంపైన టీడీపీ వెంట‌నే స్పందించ‌లేక పోయింది. వైసీపీ మాత్రం ఈ `రెక్కీ`ని తీవ్రంగా ప‌రిగ‌ణిస్తోంది. నేరుగా సీఎం జ‌గ‌న్ మోహ‌న్మోహ‌న్ రెడ్డి ఈ వ్య‌వ‌హారంపై దృష్టి పెట్టాడు. భ‌ద్ర‌త‌ను పెంచాల‌ని ఏపీ పోలీస్ ను ఆదేశించాడు.

Also Read :  దేవినేని Vs వంగ‌వీటి.. మ‌ళ్లీ తెర‌పైకి పాత‌క‌క్ష‌లు.. ?

తెలుగుదేశం పార్టీలో ఉంటోన్న రాధా ఏపీ ప్ర‌భుత్వం ఇచ్చిన 2+2 భ‌ద్ర‌త‌ను సున్నితంగా తిర‌స్క‌రించాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న 1+1 సెక్యూరిటీ చాల‌ని స‌రిపెట్టుకుంటున్నాడు. ప్ర‌భుత్వ భ‌ద్ర‌త కంటే అభిమానులు, స‌హ‌చ‌రులు ఇచ్చే ర‌క్ష‌ణ మిన్నంటూ అభిప్రాయ‌ప‌డుతున్నాడు. మంత్రి కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ ఇద్ద‌రూ ఆయ‌న‌కు సెక్యూరిటీని పెంచాల‌ని ప్ర‌భుత్వానికి సూచించారు. పైగా రాధా బంగారం అంటూ కొడాలి ప్ర‌శంసిస్తున్నాడు. కొద్దిగా రాగి క‌లిపితే మంచి ఆభ‌ర‌ణంగా త‌యారు అవుతాడ‌ని అభివ‌ర్ణించ‌డం వెనుక వైసీపీ గాలం వేస్తుంద‌ని స్ప‌ష్టం అవుతోంది. కానీ, రాధా నుంచి ఎలాంటి సంకేతం వైసీపీకి వెళ్ల‌లేదు.టీడీపీ రెబ‌ల్ ఎమ్మెల్యే వంశీ, మంత్రి కొడాలి నాని నియోజ‌క‌వ‌ర్గాలు గ‌న్న‌వ‌రం, గుడివాడ‌. ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో రాధాకు పెద్ద సంఖ్య‌లో అనుచ‌రులు ఉన్నారు. కాపు సామాజిక‌వ‌ర్గం బ‌లంగా ఆ రెండు చోట్ల ఉంది. గెలుపు కోసం ఆ ఓటు బ్యాంకు ప‌నికి రాన‌ప్ప‌టికీ ఓడించ‌గ‌ల‌ద‌ని టీడీపీ భావిస్తోంది. అందుకే, రాధాకు వైసీపీ గాలం వేస్తుంద‌ని అంచ‌నా వేస్తోంది. నాని, వంశీ స్నేహం కూడా రాధా ఓట్ల కోసమంటూ టీడీపీ భావిస్తోంది. `రెక్కీ` వ్య‌వ‌హారాన్ని తేల్చాల‌ని టీడీపీ డిమాండ్ చేస్తోంది.

Also Read : రెక్కీ’ రాధా మ‌రో కోణం.!

`రెక్కీ` వెనుక గుణ‌ద‌ల బ్యాచ్ ఉంద‌ని అనుమానిస్తున్నారు. ఒక వేళ అదే నిజ‌మైతే, రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు చాలా బ‌లంగా విజ‌య‌వాడ కేంద్రంగా మారే ఛాన్స్ ఉంది. సుదీర్ఘంగా గుణ‌ద‌ల బ్యాచ్ కి, వంగ‌వీటి కుటుంబానికి రాజ‌కీయ వైరం ఉంది. ముఠా త‌గాదాలు కూడా ఉన్నాయి. ఆ క్ర‌మంలో గుణ‌ద‌ల బ్యాచ్ హ‌స్తం ఉంద‌ని పోలీసు విచార‌ణ‌లో బ‌య‌ట‌ప‌డితే వైసీపీ రాజ‌కీయంగా నష్ట‌పోయే అవ‌కాశం లేక‌పోలేదు. కానీ, టీడీపీ సానుభూతి ప‌రునిగా ఉన్న ఒక పారిశ్రామిక వేత్త ప్ర‌మేయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నార‌ని తెలిసింది.ఇటీవ‌ల విజ‌య‌వాడ‌లో జ‌రిగిన ఒక హ‌త్య కేసులో నిందితుడిగా ఆ పారిశ్రామిక‌వేత్త ఉన్నాడు. పాత సామాను వ్యాపారం చేసుకుంటూ పారిశ్రామిక వేత్త‌గా ఎదిగాడు. బ‌ల‌మైన సామాజిక నేప‌థ్యం ఉన్న ఆయ‌న అనుచ‌రులు `రెక్కీ` నిర్వ‌హించార‌నే టాక్ బెజ‌వాడ కేంద్రంగా న‌డుస్తోంది. హత్య‌కు స్కెచ్ వేయ‌డంలో ఆ పారిశ్రామిక వేత్త దిట్ట‌ని స్థానికులకు తెలుసు. గ‌తంలోనూ ఆయ‌న చేసిన ప‌థ‌క ర‌చ‌న ప్ర‌కారం కొన్ని హ‌త్య‌లు జ‌రిగాయ‌ని విజ‌య‌వాడ రౌడీల గురించి తెలిసిన వాళ్ల వినికిడి. ఒక వేళ `రెక్కీ` వెనుక ఆ పారిశ్రామిక‌వేత్త ప్ర‌మేయం ఉంద‌ని తేలితే, టీడీపీపై ఎంతో కొంత ప్ర‌భావం ప‌డే అవ‌కాశం లేక‌పోలేదు.
మొత్తం మీద `రెక్కీ` వ్య‌వ‌హారాన్ని తేల్చాల‌ని సీఎం జ‌గ‌న్‌, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబు ఇద్ద‌రూ ప‌ట్టుబ‌డుతున్నారు. ఆ క్ర‌మంలో రాధా వ్యాఖ్య‌ల‌ను సుమోటోగా తీసుకుని విచారిస్తోన్న పోలీసులు ఒక ఛాలెంజ్ తీసుకున్నారు. త్వ‌ర‌లోనే పోలీస్ నివేదిక వ‌స్తుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. ఆ త‌రువాత జ‌రిగే రాజ‌కీయ ప‌రిణామాలు చాలా సీరియస్ గా ఉంటాయ‌ని విశ్లేష‌కుల అభిప్రాయం. సో…రాధా `రెక్కీ` వ్య‌వ‌హారం 2024 ఎన్నిక‌ల మ‌లుపుగా చెప్పుకోవచ్చు.

Exit mobile version