AP Politics : ఏపీ రాజ‌కీయాలపై అమెరికా `పెద్ద మ‌నిషి` డీల్‌!

ఏపీ రాజ‌కీయాల‌ను ప‌వ‌న్ అమెరికా ప‌ర్య‌ట‌న కీల‌క మ‌లుపు తిప్ప‌నుంది. అమెరికా కేంద్రంగా అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకున్నాయ‌ని విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - September 29, 2022 / 12:29 PM IST

ఏపీ రాజ‌కీయాల‌ను ప‌వ‌న్ అమెరికా ప‌ర్య‌ట‌న కీల‌క మ‌లుపు తిప్ప‌నుంది. అమెరికా కేంద్రంగా అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకున్నాయ‌ని విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది. అక్క‌డి కీల‌క పారిశ్రామిక‌వేత్త ఒక‌రు వైసీపీ, జ‌న‌సేన మ‌ధ్య `ఢీ`ల్ సెట్ చేసిన‌ట్టు కొంద‌రు ఎన్నారైల నుంచి అందుతోన్న స‌మాచారం. రాబోవు రోజుల్లో జ‌న‌సేన ఒంట‌రిగా లేక బీజేపీతో క‌లిసి వెళ్ల‌డానికి సిద్ద‌మైన‌ట్టు అమెరికా ఎన్నారైల్లో చ‌క్క‌ర్లు కొడుతోన్న హాట్ న్యూస్‌.

వారం క్రితం ప‌వ‌న్ అమెరికా వెళ్లారు. విరాళాల‌ను సేక‌రించే ప‌నిలో ఆయ‌న ఉన్నార‌ని తెలుస్తోంది. ఆ క్ర‌మంలో నెల్లూరు జిల్లాకు చెందిన ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త‌ను క‌లిశార‌ట‌. సాధార‌ణంగా అమెరికా వెళ్లే రాజ‌కీయ నాయ‌కులు పార్టీల‌కు అతీతంగా ఆ పారిశ్రామిక‌వేత్త‌ను దాదాపు క‌లుస్తుంటారు. ఆయ‌న సుమారు 30 రాష్ట్రాల్లో కార్పొరేట్ ఆస్ప‌త్రుల‌ను అమెరికాలో నిర్వ‌హిస్తున్నారు. ఎన్నారైలు అంద‌రూ ట్రిలియనీర్ గా ఆయ‌న్ను భావిస్తుంటారు. అంతేకాదు, `రెడ్డి` సామాజిక‌వ‌ర్గానికి ఐకాన్ గా మిలిగిన వాళ్లు ఫీల్ అవుతుంటారు.

ఉమ్మ‌డి ఏపీ నుంచి ఇప్ప‌టి విడిపోయిన తెలంగాణ‌, ఏపీ రాష్ట్రాల్లోని పార్టీలు దాదాపుగా ఆయ‌న నుంచి పెద్ద మొత్తంలో విరాళాల‌ను తీసుకున్నార‌ని స‌ర్వత్రా వినిపించే మాట‌. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అన్నీతానై చూసుకున్న ఆ పారిశ్రామిక‌వేత్త ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌భుత్వం ప‌రిచ‌యం చేస్తోన్న స‌రికొత్త వైద్య విధానంకు తెర వెనుక వ్యూహ‌క‌ర్త‌గా ఉన్నార‌ని వినికిడి. నెల్లూరు జిల్లాకు చెందిన ఆయ‌న తెలుగు రాష్ట్రాల్లోని రాజ‌కీయాల‌ను అమెరికా నుంచి శాసిస్తుంటారని చెప్పుకుంటారు. ఇటీవ‌ల పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, స్టార్ క్యాంపెయిన‌ర్ గా ఉన్న కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి మ‌ధ్య స‌యోధ్య‌కు కూడా ఆయ‌న ప్ర‌య‌త్నం చేశార‌ని అమెరికా వెళ్లిన కాంగ్రెస్ వ‌ర్గాల్లో వినిపించే మాట‌.

ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల‌ను సెట్ చేయ‌డానికి ఆయ‌న రంగంలోకి దిగిన‌ట్టు తెలుస్తోంది. ఆ క్ర‌మంలో భారీగా విరాళాన్ని జన‌సేన‌కు ఇవ్వ‌డానికి ముందుకొచ్చార‌ని స‌మాచారం. అయితే, ఒక కండిష‌న్ తో భారీ విరాళాన్ని విడుద‌ల చేయ‌డానికి సిద్ధ‌ప‌డ్డార‌ని తెలుస్తోంది. ఒంటిరిగా లేదా బీజేపీతో క‌లిసి జ‌న‌సేన‌ క‌లిసి వెళ్లాల‌ని కండీష‌న్ పెట్టార‌ట‌. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి రాకుండా చేయ‌డం ఆయ‌న ల‌క్ష్యంగా ఉంద‌ని ఎన్నారైల్లోని టాక్‌. ఆ దిశ‌గా జ‌న‌సేన ముందడుగు వేస్తే భారీ విరాళాన్ని ఇవ్వ‌డానికి సిద్దం అయ్యార‌ని ఎన్నారైల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

ప‌ది నుంచి 15 స్థానాల్లో వైసీపీ బ‌ల‌హీన‌మైన అభ్య‌ర్థుల‌ను పెట్ట‌డం ద్వారా జ‌న‌సేన‌కు తెర వెనుక మ‌ద్ధ‌తు ఇచ్చేలా `ఢీ`ల్ సెట్ అయిన‌ట్టు అమెరికా ఎన్నారైల్లో చ‌క్క‌ర్లు కొడుతోన్న న్యూస్. మిగిలిన చోట్ల వైసీపీకి తెర వెనుక మ‌ద్ధ‌తు ఇవ్వాల‌నే కండీష‌న్ మ‌ధ్య భారీ విరాళానికి లింకు పెట్టార‌ని తెలుస్తోంది. గ‌తంలో అమెరికా కేంద్రంగా టీడీపీ, జ‌న‌సేన పొత్తు తానా స‌భ‌ల సంద‌ర్భంగా సెట్ అయిన‌ట్టు అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. ఆ రెండు పార్టీలు ఆ దిశ‌గా అడుగులు వేస్తూ వ‌చ్చాయి. బీజేపీ, జ‌న‌సేన‌, టీడీపీ పొత్తు దాదాపుగా ఖాయ‌మ‌నుకుంటోన్న టైమ్ లో అమెరికా `పెద్ద‌మ‌నిషి` ఎంట్రీ ఇవ్వ‌డంతో ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క మ‌లుపు సంత‌రించుకోనుందని తెలుస్తోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌న‌సేనాని ప‌వ‌న్ నుంచి ఆ `పెద్ద మ‌నిషి`కి ఎలాంటి పాజిటివ్ సంకేతం వెళ్ల‌లేద‌ట‌. ఒక వేళ పాజిటివ్ గా ప‌వ‌న్ స్పందింస్తే, భారీ విరాళం జ‌న‌సేన ఖాతాలోకి వ‌చ్చి ప‌డ‌నుంది. అంతేకాదు, 10 నుంచి 15 చోట్ల జ‌న‌సేన అభ్య‌ర్థుల‌ను గెలిపించే బాధ్య‌త‌ల‌ను కూడా తెర వెనుక నుంచి వైసీపీ తీసుకుంటుంద‌ని వినికిడి. ఇలా ఏపీ రాజ‌కీయాలను అమెరికాలోని `పెద్ద మ‌నిషి` కుదుర్చిన లేటెస్ట్ `ఢీ`ల్ గా ప్ర‌చారం జ‌రుగుతోంది. అమెరికా కేంద్రంగా వైసీపీ, జ‌న‌సేన మ‌ధ్య ఢిల్ ఓకే అయింద‌ని పేరు చెప్ప‌డానికి ఇష్ట‌ప‌డని ఒక ఎన్నారై చెబుతున్నారు. ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో భ‌విష్య‌త్ నిర్ణ‌యించాలి.