Ram Mohan Naidu : కేంద్ర మంత్రి, టీడీపీ నేత రామ్మోహన్ నాయుడుకు అరుదైన ఘనత దక్కింది. ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) 50 దేశాలకు చెందిన 116 మందితో విడుదల చేసిన యంగ్ గ్లోబల్ లీడర్స్ జాబితాలో రామ్మోహన్ నాయుడుకు చోటు దక్కింది. ప్రస్తుతం ఆయన భారత పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. 40 ఏళ్లలోపు వయస్సు ఉండి వేర్వేరు రంగాల్లో తమదైన ముద్ర వేసి, ప్రపంచ స్థితిగతుల అభివృద్ధికి కృషి చేస్తున్న వారిన ఈ పురస్కారం కోసం ఎంపిక చేస్తుంటారు. రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu)తో పాటు భారత్ నుంచి మొత్తం తొమ్మిది మంది యంగ్ గ్లోబల్ అవార్డుకు ఎంపికయ్యారు.
Also Read :Telangana Govt Jobs: ఉద్యోగాల జాతర.. 18,236 పోస్టులు.. త్వరలో నోటిఫికేషన్లు
యంగ్ గ్లోబల్ లీడర్స్ జాబితాలో భారతీయులు వీరే..
- రితేష్ అగర్వాల్ : ఈయన OYO హోటల్స్ అండ్ హోమ్స్ వ్యవస్థాపకుడు.
- కింజరాపు రామ్మోహన్ నాయుడు : ఈయన భారత పౌర విమానయాన శాఖ మంత్రి.
- మానసి సుబ్రమణ్యం : ఈమె పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియాలో చీఫ్ ఎడిటర్, వైస్ ప్రెసిడెంట్ హోదాలో పనిచేస్తున్నారు.
- నటరాజన్ శంకర్ : బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌లో మేనేజింగ్ డైరెక్టర్, భాగస్వామిగా పనిచేస్తున్నారు.
- అనురాగ్ మాలూ : ఈయన పర్వతారోహకుడు. ఓరోఫైల్ వెంచర్స్ (క్లైంబింగ్ 4SDGs)లో కీనోట్ స్పీకర్.
- నిపున్ మల్హోత్రా : ఈయన నిప్మాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు.
- అలోక్ మెడికేపుర అనిల్ : ఈయన నెక్స్ట్ బిగ్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్.
- హిమాంశు గుప్తా : క్లైమేట్ ఏఐ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓగా ఉన్నారు.
- తెరాశ్ని పిళ్లై : ఈమె స్విస్ ఆర్‌ఈ కార్పొరేట్ సొల్యూషన్స్ ఆఫ్రికా విభాగం సీఈఓగా ఉన్నారు.
Also Read :Bhu Bharati Portal: ‘భూ భారతి’ సేవలు ఏమిటి ? ఛార్జీలు ఎంత ?
ప్రత్యేక శిక్షణ సైతం..
దాదాపు 1000 కార్పొరేట్ కంపెనీలు కలిసి వరల్డ్ ఎకానమిక్ ఫోరంను నడుపుతున్నాయి. ఆ కంపెనీల నుంచే వరల్డ్ ఎకానమిక్ ఫోరం నిర్వహణకు నిధులు సమకూరుతుంటాయి. ఏటా 100 మందికిపైగా ప్రభావవంతమైన యువతను యంగ్ గ్లోబల్ లీడర్ పురస్కారాలకు ఎంపిక చేస్తారు. వారికి మూడేళ్ల పాటు వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలను వరల్డ్ ఎకానమిక్ ఫోరం ఏర్పాటు చేస్తుంది. వరల్డ్ ఎకానమిక్ ఫోరంకు నిధులను అందించే కంపెనీల విజన్‌కు అనుగుణంగానే ఈ కార్యక్రమాలన్నీ డిజైన్ అవుతాయి. ఆర్థిక, టెక్, ప్రభుత్వ వ్యవహారాలు, క్రియేటివ్ పరిశ్రమలు, ప్రజా సేవ వంటి విభాగాల యువతను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు.