Site icon HashtagU Telugu

Uniform Civil Code : జ‌గ‌న్ కు మోడీ అగ్నిప‌రీక్ష‌, ఉమ్మ‌డి పౌర‌స్మృతి బిల్లుతో లొల్లి

common civil code

Cm Jagan Request to 19 opposition parties to come opening of new parliament building

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాబోయే రోజుల్లో అగ్నిప‌రీక్ష ను(uniform civil code)   ఫేస్ చేయ‌బోతున్నారు. ఎన్డీయేలో భాగ‌స్వామ్యం కావాల‌ని మ‌రోసారి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ఆయ‌న్ను కోరిన‌ట్టు ఢిల్లీ వ‌ర్గాల స‌మాచారం. గ‌తంలోనూ కేంద్ర మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ సంద‌ర్భంగా ఎన్డీయేలో భాగ స్వామ్యం కావాల‌ని బీజేపీ పెద్ద‌లు కోరారు. ఆ విష‌యాన్ని అప్ప‌ట్లో వైసీపీలోని కీల‌క లీడ‌ర్లు వెల్ల‌డించారు. ఈసారి కూడా కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ సంద‌ర్భంగా పాత ప్ర‌తిపాద‌న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముందు ఉంచార‌ని తెలుస్తోంది.

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాబోయే రోజుల్లో అగ్నిప‌రీక్ష(uniform civil code) 

ఎన్టీయేలో భాగ‌స్వామ్యాన్ని సున్నితంగా తిర‌స్క‌రిస్తోన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కేంద్ర నుంచి ఇటీవ‌ల నిధుల‌ను భారీగా పొంద‌గ‌లిగారు. అందుకు ప్ర‌తిగా రాబోయే పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ఉమ్మ‌డి పౌరస్మృతి బిల్లుకు మ‌ద్ధ‌తు (uniform civil code)  ప‌లక‌డానికి నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. కామ‌న్ సివిల్ కోడ్ కు మ‌ద్ధ‌తుగా వైసీపీ నిల‌వ‌బోతుంది. ఆ మేర‌కు న‌రేంద్ర మోడీకి ఢిల్లీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హామీ ఇచ్చిన‌ట్టు వినికిడి. ఆ బిల్లుకు మ‌ద్ధ‌తు ప‌లికే పార్టీల‌కు ముస్లింల మైనార్టీలు దూరం అవుతార‌ని ఆయా పార్టీల అభిప్రాయం. అందుకే, వ్య‌తిరేకిస్తూ ఉన్నాయి.

వైసీపీ ఎంపీలు మ‌ద్ధ‌తు ఇస్తే రాజ్య‌స‌భ‌లోనూ  బిల్లు ఆమోదం

వ్య‌వ‌సాయ చ‌ట్టాల విష‌యంలోనూ బీఆర్ఎస్, వైసీపీ స‌మ‌దూరాన్ని పాటించాయి. ఓటింగ్ స‌మ‌యంలో పార్ల‌మెంట్ బ‌య‌ట‌కు వెళ్ల‌డం ద్వారా ప‌రోక్ష మ‌ద్ధ‌తును బీజేపీకి ప‌లికారు. రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో బ‌హిరంగంగా వైసీపీ మ‌ద్ధ‌తు ప‌లికింది ఆ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ మాత్రం వ్య‌తిరేకించింది. కానీ, ఇప్పుడు మారిన ప‌రిస్థితుల దృష్ట్యా ఎన్డీయేకు అనుకూలంగా కేసీఆర్ న‌డుచుకుంటున్నారు. రాజ‌కీయ స‌భ‌ల్లోనూ బీజేపీ మీద ఎలాంటి విమ‌ర్శ‌లు చేయ‌డంలేదు. కామ‌న్ సివిల్ కోడ్ బిల్లు పార్ల‌మెంట్లో ఆమోదం పొంద‌డానికి వైసీపీ, బీఆర్ఎస్ మ‌ద్ధ‌తు అవ‌స‌రం. ఒక వేళ బీఆర్ఎస్ దూరంగా ఉన్న‌ప్ప‌టికీ వైసీపీ ఎంపీలు మ‌ద్ధ‌తు ఇస్తే రాజ్య‌స‌భ‌లోనూ (uniform civil code)  బిల్లు ఆమోదం పొందుతుంది.

Also Read : Canada Kalithan: కెన‌డాలో పంజాబ్ `ఖ‌లీస్తాన్` క‌ల‌క‌లం

ఈనెల 18న ఎన్డీయే స‌మావేశాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నిర్వ‌హించ‌బోతున్నారు. ఆ స‌మావేశంలో ఉమ్మ‌డి పౌర‌స్మృతి ప్ర‌ధాన ఎజెండాగా ఉండ‌బోతుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇదే అంశాన్ని ప్ర‌ధాన అస్త్రంగా చేసుకోవాల‌ని బీజేపీ భావిస్తోంది. ఉమ్మడి పౌరస్మృతి  (Uniform Civil Code)   మీద 30 రోజులలోగా తమ సూచనలను తెలపాలని భారత 22వ లా కమిషన్ జూన్ 14న ప్రభావిత సమూహాలు, మత సంస్థలు, ప్రజలను కోరింది. పక్షం రోజుల్లోనే 8.5లక్షల మంది స్పందించారని లా కమిషన్ చైర్మన్ రితు రాజ్ అవస్థి ప్రకటించారు. ఇక ఈనెల 20వ తేదీ నుంచి వ‌ర్షాకాల పార్ల‌మెంట్ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ స‌మావేశాల్లో ఉమ్మ‌డి పౌర‌స్మృతి బిల్లును ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్నారు.

Also Read : Jagan Delhi Tour: జగన్ ముందస్తు ముచ్చట.. మోడీ గ్రీన్ సిగ్నల్!

దేశంలోని భిన్న మ‌తాలు, జాతుల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌త్యేక చ‌ట్టాలు ఉన్నాయి. భార‌త‌దేశంలోని ప్ర‌తి పౌరుడికి ఒకే చ‌ట్టం అనే రీతిలో ఉమ్మ‌డి పౌర‌స్మృతి బిల్లు  (uniform civil code)  రూపొందింది. ఆ బిల్లు చ‌ట్టరూపంలోకి వ‌చ్చిన వెంట‌నే అన్ని జాతాలు, మ‌తాల‌కు ఒకే చ‌ట్టం ఉంటుంది. ఒకే దేశం ఒకే చ‌ట్టం అనే నినాదంతో ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని మోడీ భాస్తున్నారని తెలుస్తోంది. ఈ పార్ల‌మెంట్ స‌మావేశాల త‌రువాత ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డానికి ఎన్డీయే ప‌క్షాలు సిద్ద‌మ‌వుతున్నాయ‌ని ఢిల్లీలోని న్యూస్. ఒక వేళ ఉమ్మ‌డి పౌర‌స్మృతి బిల్లుకు వైసీపీ మ‌ద్ధ‌తు ప‌లికితే, ముస్లిం ఓటు బ్యాంకు చీలిపోయే ప్ర‌మాదం లేక‌పోలేదు. అందుకే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌మీప భ‌విష్య‌త్ లో అగ్నిప‌రీక్ష‌ను కేంద్రం రూపంలో అందుకోనున్నారు.