‘Adugudam Andhra’ : ఏపీలో ‘అడుగుదాం ఆంధ్ర’ పేరుతో నిరుద్యోగుల నిరసన..

ఏపీలో అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస నిరసనలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇప్పటీకే అంగన్వాడి, మున్సిపాలిటీ కార్యకర్తలు తమ డిమాండ్ లను..ఎన్నికల హామీలను సీఎం జగన్ నెరవేర్చాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు చేస్తుండగా..తాజాగా ‘అడుగుదాం ఆంధ్ర’ (Adugudam Andhra Program ) పేరుతో నిరుద్యోగులు నిరసన బాట పట్టారు. ‘ఆడుదాం ఆంధ్రా’ (Adudam Andhra Program) క్రీడా పోటీలను ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా పబ్లిక్‌ స్కూల్‌లో లాంఛనంగా ప్రారంభించారు. […]

Published By: HashtagU Telugu Desk
Adugudam Andhra

Adugudam Andhra

ఏపీలో అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస నిరసనలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇప్పటీకే అంగన్వాడి, మున్సిపాలిటీ కార్యకర్తలు తమ డిమాండ్ లను..ఎన్నికల హామీలను సీఎం జగన్ నెరవేర్చాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు చేస్తుండగా..తాజాగా ‘అడుగుదాం ఆంధ్ర’ (Adugudam Andhra Program ) పేరుతో నిరుద్యోగులు నిరసన బాట పట్టారు. ‘ఆడుదాం ఆంధ్రా’ (Adudam Andhra Program) క్రీడా పోటీలను ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా పబ్లిక్‌ స్కూల్‌లో లాంఛనంగా ప్రారంభించారు.

ఇదే తరుణంలో ఏపీ నిరుద్యోగులు ‘అడుగుదాం ఆంధ్ర’ పేరుతో నిరసన బాట పట్టారు. ‘అడుగుదాం ఆంధ్ర .. ఇది ఉద్యోగాల వేట నిరుద్యోగుల మాట’ పేరుతో రాష్ట్రంలో నిరుద్యోగులు ఆందోళనకు పిలుపునిచ్చింది. నిరుద్యోగులకు కావాల్సింది ఉద్యోగాలే కానీ పరీక్షల సమయంలో ఆటలు కాదని జాబ్ క్యాలెండరు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్రంలో క్రీడా మైదానాలు బాగు చెయ్యాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. గుంటూరులో నల్లపాడు లయోలా కాలేజికి’ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి వస్తున్నా ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇవ్వాలని గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ , యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె పవన్ తేజ, ఎన్ ఎస్ యూ ఐ జిల్లా అధ్యక్షులు షేక్ కరీంలు ప్రయత్నించారు. వీరిని యువజన విద్యార్థి నాయకులను పోలీసులు చుట్టుగుంటలో అడ్డుకొని అరెస్ట్ చేశారు. అనంతరం వారిని నగరం పాలెం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఇక ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీల విషయానికి వస్తే.. డిసెంబర్‌ 26 నుంచి ఫిబ్రవరి 10వతేదీ వరకు 47 రోజుల పాటు నిర్విరామంగా ఈ పోటీలను నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. తొలి దశలో జనవరి 9వతేదీ నాటికి గ్రామ/వార్డు సచివాలయాల స్థాయిలో పోటీలను పూర్తి చేయనున్నారు. షెడ్యూల్‌ ప్రకారం జనవరి 10 నుంచి 23 వరకు మండల స్థాయిలో, జనవరి 24 నుంచి 30 వరకు నియోజకవర్గ స్థాయిలో, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జిల్లా స్థాయిలో, ఫిబ్రవరి 6వతేదీ నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి పోటీలు జరగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటలకు వరకు పోటీలు నిర్వహించేలా షెడ్యూల్‌ ఖరారు చేశారు. పాఠశాల విద్యాశాఖ పీఈటీలు, పీడీలతో పాటు శాప్‌ కోచ్‌లు, క్రీడా సంఘాలను పోటీలు సమర్థంగా నిర్వహించేలా సమాయత్తం చేశారు. ఇప్పటికే రిఫరీలుగా 1.50 లక్షల మంది వలంటీర్లకు ప్రత్యేక శిక్షణ అందించారు. క్రీడాకారుల మొబైల్‌ ఫోన్లకు మ్యాచ్‌ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించనున్నారు.

Read Also : WhatsApp Alert : వాళ్లకు వాట్సాప్‌ ‘స్క్రీన్ షేర్’ చేశారో అంతే సంగతులు!

  Last Updated: 26 Dec 2023, 12:46 PM IST