Site icon HashtagU Telugu

Vundavalli Sridevi : ఉండవల్లి శ్రీదేవికి బాబు వెన్నుపోటు..?

Undavalli Sridevi

Undavalli Sridevi

వైసీపీ నుంచి టీడీపీలో చేరిన తాడికొండ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి (Vundavalli Sridevi) ఆసక్తికర ట్వీట్ (Latest Tweet) చేశారు. టీడీపీ నుంచి బాపట్ల ఎంపీ సీటు (Bapatla MP seat
) ఆశించిన ఆమెకు భంగపాటే ఎదురైంది. ఈ నేపథ్యంలో ‘రాజకీయాలు ఎలా ఉంటాయో..ఎవరు ఎలాంటి వారో ఈరోజు అర్థమయింది’ అని ట్వీట్ చేశారు. బాపట్ల జిల్లా మ్యాప్, ట్యాగ్ని జత చేసి పక్కన కత్తి సింబల్ (Sword symbol) ఉంచారు. ఈ ట్వీట్ చూసిన వారంతా శ్రీదేవికి బాబు (CHandrababu) వెన్నుపోటు పొడిచారంటూ కామెంట్స్ వేస్తున్నారు.

లబ్ డబ్ అని కాదు, జగన్ జగన్ అని గుండె కొట్టుకుంటుందంటూ ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చెప్పిన డైలాగులు అప్పట్లో ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. శ్రీదేవి డైలాగ్స్ జగన్ మాత్రమే కాదు అసెంబ్లీ ఉన్నవారంతా అబ్బా ఏమన్నా చెప్పిందా అని మాట్లాడుకున్నారు. ఆ తర్వాత జగన్ తో విభేదించి టీడీపీలో చేరారామె. ఆ తర్వాత టీడీపీ లో తన మార్క్ చూపిస్తూ హడావిడి చేసారు. టీడీపీ చేసే ప్రతి కార్యక్రమంలో పాల్గొంది. తీరా ఎన్నికల టైమ్ లో ఆమెకు..బాబు టికెట్ ఇవ్వకపోయేసరికి షాక్ కు గురై.. చంద్రబాబు ఫై పరోక్షంగా విమర్శలు చేయడం మొదలుపెట్టింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈమెకు మాత్రమే కాదు వైసీపీని కాదని టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు గట్టి షాకిచ్చారు. జగన్‌తో విభేదించి..ఆనం నారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ దక్కుతుందని ఎంతో ఆశపడ్డారు..కానీ చంద్రబాబు ఈ నలుగురిలో ఇద్దరికీ మొండిచేయి చూపించారు. ఆనం రాంనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలకు మాత్రమే టికెట్ ఇవ్వగా.. ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖరరెడ్డిలకు వారి నియోజకవర్గాల్లో వేరే వ్యక్తులకు టిక్కెట్లు కేటాయించారు. తనకు టికెట్ దక్కకపోవడంపై ఉండవల్లి శ్రీదేవి ఘాటుగా స్పందించింది. ముందు ముందు ఇంకెన్ని ఘాటు విమర్శలు చేస్తుందో చూడాలి.

Read Also : Virat Kohli Creates T20 History : టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన కోహ్లీ