Employees Ugadi Gift to Jagan: జగన్ కు ఉద్యోగుల ఉగాది ఝలక్

తెలుగు నూతన ఏడాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు వర్క్ టూ రూల్ పాటిస్తున్నారు.ఆ మేరకు ఏపీ జేఏసీ అమరావతి పిలుపునిచ్చింది.

  • Written By:
  • Publish Date - March 22, 2023 / 08:00 AM IST

తెలుగు నూతన ఏడాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు (Employees) వర్క్ టూ రూల్ పాటిస్తున్నారు.ఆ మేరకు ఏపీ జేఏసీ అమరావతి పిలుపునిచ్చింది. జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యోగులను ఉద్దేశించి ఓ ప్రకటన చేశారు. ఉద్యోగులు ప్రభుత్వం బకాయిలు చెల్లించనందుకు నిరసనగా మంగళవారం నుంచి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5. 30 వరకూ మాత్రమే పనిచేయాలని కోరారు. ఈ మేరకు ఉద్యమంలో పాల్గొంటున్న ఉద్యోగ సంఘాలన్నింటికీ సమాచారం పంపారు. దీంతో మంగళవారం సాయంత్రం 5.30 గంటలకే పని నిలిపివేయనున్నారు.

మరోవైపు సచివాలయ సీపీఎస్ ఉద్యోగులు (Employees) సైతం ఉద్యమంలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఈ నెల 23న సీఎస్, ఆర్థిక కార్యదర్శికి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు.ఈ నెల 23న సీపీఎస్ ఉద్యోగులందరూ తమ శాఖ కార్యదర్శికి వినతిపత్రం అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులకు ఈ ఏడాది జీతంలో 10 శాతం మినహాయించిన జగన్ సర్కార్ ప్రభుత్వ వాటాతో కలిపి పెన్షన్ ఖాతాకు జమ చేయలేదు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో 90 శాతం జీతం ఇచ్చి.. ఐటీ మాత్రం మొత్తం జీతానికి ఎలా వసూలు చేస్తారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వానికీ, ఉద్యోగులకూ మధ్య గ్యాప్ అంతకంతకూ పెరుగుతోంది. అసలే ఎన్నికల వేళ ప్రభుత్వం తమ బకాయిల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఇప్పటికే ఈ మేరకు ఉద్యమం ప్రారంభించిన ఉద్యోగులు.. విభిన్న రూపాల్లో తమ నిరసనలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం నుంచి ఉద్యమాన్ని మరో మలుపు తిప్పారు.

Also Read:  Telugu Calendar: తెలుగు సంవత్సరాలు 60 మాత్రమే ఎందుకో తెలుసా?