Pani Puri : ఏపీలో ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసిన పానీపూరి

ప్రస్తుతం పానీపూరి (Pani Puri) కి ఎంత డిమాండ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు పెద్ద పెద్ద సిటీలలోనే ఈ పానీపూరి బండ్లు కనిపించేవి..కానీ ఇప్పుడు మరుమూలా గ్రామాల్లో కూడా పానీపూరి బండ్లు కనిపిస్తున్నాయి. చూసేందుకు చాల చీఫ్ గా కనిపించిన..వీటి రాబడి..లాభాలు ఏ సాఫ్ట్ వెర్ ఉద్యోగికి కూడారవు. ఆ రేంజ్ లో ఈ బిజినెస్ నడుస్తుంది. దీంతో చాలామంది ఈ పానీపూరి బండ్లను ఓపెన్ చేస్తున్నారు. చోటూ.. పది రూపాయల పానీపూరీ ఇవ్వు.. అంటాం. […]

Published By: HashtagU Telugu Desk
Two Children Died After Eat

Two Children Died After Eat

ప్రస్తుతం పానీపూరి (Pani Puri) కి ఎంత డిమాండ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు పెద్ద పెద్ద సిటీలలోనే ఈ పానీపూరి బండ్లు కనిపించేవి..కానీ ఇప్పుడు మరుమూలా గ్రామాల్లో కూడా పానీపూరి బండ్లు కనిపిస్తున్నాయి. చూసేందుకు చాల చీఫ్ గా కనిపించిన..వీటి రాబడి..లాభాలు ఏ సాఫ్ట్ వెర్ ఉద్యోగికి కూడారవు. ఆ రేంజ్ లో ఈ బిజినెస్ నడుస్తుంది. దీంతో చాలామంది ఈ పానీపూరి బండ్లను ఓపెన్ చేస్తున్నారు.

చోటూ.. పది రూపాయల పానీపూరీ ఇవ్వు.. అంటాం. ప్లేట్ పట్టుకుంటాం. ఇన్ని ఉల్లిపాయ ముక్కలు ప్లేట్ లో వేసుకొని.. పూరీలో ఇంత చాట్ వేసి.. ఓ రకమైన పానీయంలో ముంచి ప్లేట్ లో పెడతాడు. దాంట్లో కొన్ని ఉల్లిగడ్డ ముక్కలేసుకొని నోట్లో వేసుకుంటే.. ఇట్టే కరిగిపోతుంది పానీపూరి. పానీపూరి అమ్మే వ్యక్తి.. టకా టకా ప్లేట్ లో పానీపూరీ వేస్తూనే ఉంటాడు. మనం ఆరగిస్తూనే ఉంటాం. అలా ఎన్ని వేసినా తింటూనే ఉంటాం. అంతలా నోరూరిస్తుంది పానీపూరీ. చిన్నపిల్లల దగ్గర్నుంచి పండు ముసలి వరకు పానీపూరీ అనగానే నోరూరాల్సిందే. అయితే కొంతమంది ఎలాంటి ఆహార నియమాలు పాటించకపోవడం తో పలు ప్రమాదాలు జరుగుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా ఏపీలో ఇద్దరు చిన్నారులు పానీపూరి తిని మరణించారు. ఈ ఘటన ఏలూరు జిల్లాలోని జంగారెడ్డి గూడెంలో చోటుచేసుకుంది. అన్నదమ్ములు వెలపాటి రామకృష్ణ (10), వెలపాటి విజయ్ (6) రాత్రి పానీపూరి తినగా గురువారం తెల్లవారుజామున వాంతులు, విరోచనాలతో బాధ పడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. మార్గమధ్యలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పానీపూరి తినడం వల్లే ఫుడ్ పాయిజన్ అయ్యి తమ బిడ్డలు చనిపోయారని తల్లిదండ్రులు వాపోతున్నారు. నంద్యాల జిల్లా వైఎస్సార్ కాలనీ నుంచి బతుకుదెరువు కోసం చిన్నారులతో కలిసి వీరు జంగారెడ్డిగూడేనికి వలస వచ్చారు. ఇక్కడ ప్లాస్టిక్ వ్యాపారం నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇక ఇప్పుడు ఇద్దరు బిడ్డలు చనిపోవడం తో మీము ఎవరికోసం బ్రతకాలి అని ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

Read Also : YS Sharmila : జగన్ వ్యాఖ్యలపై షర్మిల రియాక్షన్..నాకు వ్యక్తిగతంగా నష్టం చేసినా భరించాను

  Last Updated: 25 Jan 2024, 01:52 PM IST