Site icon HashtagU Telugu

Humanity: అనాథ వృద్ధుడిని కాపాడిన ఏపీ పోలీసులు

Imgonline Com Ua Twotoone N2wtiye9uck Imresizer

Imgonline Com Ua Twotoone N2wtiye9uck Imresizer

రోడ్డుపై ప‌డిపోయిన అనాథ వృద్ధుడిని ఇద్ద‌రు ట్రాఫిక్ కానిస్టేబుళ్లు కాపాడారు. విజయనగరం ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న వై.సురేష్ కుమార్, ఆర్. సత్యనారాయణ మంగళవారం ట్రాఫిక్ నియంత్రణ విధుల్లో ఉండగా క్లాక్ టవర్ జంక్షన్ సమీపంలో ఓ వృద్ధుడు పడి ఉండడాన్ని గుర్తించారు.

వృద్ధుడి పరిస్థితిని తెలుసుకున్న సురేష్‌కుమార్‌, సత్యనారాయణ మరో కానిస్టేబుల్‌ సత్యంనాయుడు సహాయంతో ఓఆర్‌ఎస్ ని ఇచ్చారు. వెంట‌నే ఆ వృద్ధుడిని ఆస్పత్రికి తరలించేందుకు ముగ్గురూ 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వృద్ధుడి చికిత్స నిమిత్తం మహారాజా జిల్లా ఆసుపత్రికి తరలించారు.

డీజీపీ గౌతమ్ సవాంగ్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ట్రాఫిక్ కానిస్టేబుళ్లను అభినందించారు. ఇద్దరు ట్రాఫిక్ కానిస్టేబుళ్లు విధుల్లో ఉండగా అనాథ వృద్ధుడికి మానవతా దృక్పథంతో సహాయం చేసి అందరి హృదయాలను గెలుచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పోలీసులు వృద్ధుడికి ఆహారం వడ్డించి ఆసుపత్రికి తరలించిన వీడియోను పంచుకున్నారు.