Site icon HashtagU Telugu

Pawan Kalyan Vs Vijay Sai Reddy : అమ‌రావ‌తి టూ విశాఖ `క్విడ్ ప్రో కో` ర‌చ్చ‌

విశాఖ‌ప‌ట్నం కేంద్రంగా వైసీపీ నేత‌ల భూముల కుంభ‌కోణం క్ర‌మంగా బ‌య‌ట‌కు వ‌స్తోంది. మూడు రాజ‌ధానుల వెనుక జ‌రిగిన `క్విడ్ ప్రో కో` వ్య‌వ‌హారం అంటూ జ‌న‌సేనాని ప‌వ‌న్ చేసిన ట్వీట్ మంగ‌ళ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా దుమ్మురేపుతోంది. ప్ర‌తిగా అమ్ముడుపోయిన ప‌వ‌న్ అంటూ జ‌గ‌న్ సైన్యం ఎదురు దాడికి దిగింది. దీంతో ట్విట్ట‌ర్ వేదిక‌గా ప‌వ‌న్ ట్రాప్ లో వైసీపీ బ్యాచ్ ప‌డిపోయింది.

`యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రా` టైటిల్ తో విశాఖ జిల్లాలోని రుషికొండ ప‌ర్వ‌త శ్రేణుల్లో ఉన్న ఈ “మౌంట్ దిల్ మాంగే మోర్` “ధ‌ర‌-వ‌ర్గ‌-కుల‌స్వామ్యానికి చిహ్నం“ అంటూ మంగ‌ళ‌వారం జ‌న‌సేనాని చేసిన ట్వీట్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. కొంద‌రు మంత్రుల ఫోటోల‌తో కూడిన ఒక కారిక‌ల్చ‌ర్ ను ఆ ట్వీట్ కు జ‌త‌చేస్తూ బాక్సైట్ టూ గంజాయ్ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆ ట్వీట్ జ‌గ‌న‌న్న సైన్యానికి ఆగ్ర‌హం క‌లిగించింది. ఇంకేముంది బూతు పురాణం, ఇల్లీగ‌ల్ వ్య‌వ‌హారాలు మీద ట్విట్ట‌ర్ వేదిక‌గా ఇరు వ‌ర్గాల మధ్య దుమ్మురేగుతోంది.

అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ ల‌క్ష్యంగా మూడు రాజ‌ధానులు చేయాల‌నుకుంటే జిల్లాల‌న్నింటినీ రాష్ట్రాలుగా ప్ర‌క‌టించి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రాగా ప్ర‌క‌టించాల‌ని వ్యంగ్యాంస్త్రాల‌ను సంధించారు ప‌వ‌న్. దీంతో జ‌నసేనాని అమ్ముడుపోయాడంటూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బ్యాచ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఫైర్ అయింది. ఉద‌యం నుంచి ఇరు వ‌ర్గాల మ‌ధ్య జ‌రుగుతోన్న ట్వీట్ల యుద్ధం మ‌ధ్య ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మీడియా ముందుకొచ్చారు.

విశాఖ‌లోని భూముల‌ను కుమార్తె కొనుగోలు చేస్తే నాకేం సంబంధం అంటూ విచిత్ర లాజిక్ తీశారు. అంతేకాదు, బ్రాహ్మ‌ణి భూములు కొనుగోలు చేస్తే బాల‌క్రిష్ణ‌కు ఏం సంబంధం అంటూ లింకు పెట్టారు. అస‌లు క్విడ్ ప్రో కో అంటే ఏమిటి? అంటూ ప్ర‌శ్నిస్తూ అమ‌రావ‌తిలో జ‌రిగిన‌దాన్ని క్విడ్ ప్రో కో అంటారని మీడియా వేదిక‌గా అయ‌న ఎదురుదాడికి దిగారు. అంతేకాదు, మీడియా ఉంద‌ని టార్గెట్ చేస్తున్నారు కాబ‌ట్టి తాను కూడా మీడియాను స్థాపిస్తాన‌ని స‌వాల్ విసిరారు. దీంతో విశాఖ‌లో జ‌రిగిన భూ కొనుగోళ్ల మీద ర‌చ్చ జ‌రుగుతోంది.