TTD Jobs : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) 56 ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. వాటిలో 27 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) పోస్టులు, 19 అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (సివిల్) పోస్టులు, 10 అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ ఫుల్ టైమ్ , పర్మినెంట్ జాబ్సే కావడంతో భారీ పోటీ నెలకొంది. ఆసక్తి, అర్హతలు కలిగిన అభ్యర్థులు టీటీడీ వెబ్ సైట్ ద్వారా అప్లై చేయొచ్చు. అయితే ఈ జాబ్స్‌కు అప్లై చేయడానికి చివరి తేదీ రేపే (నవంబర్ 23).
We’re now on WhatsApp. Click to Join.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హిందూ మత అభ్యర్థులు మాత్రమే ఈ జాబ్స్‌కు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే వారు బీఈ, బీటెక్ (సివిల్/ మెకానికల్), ఎల్‌సీఈ/ఎల్‌ఎంఈ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్)లో పాసై ఉండాలి. అభ్యర్థుల వయసు 42 సంవత్సరాలకు మించకూడదు. ఓసీలకు దరఖాస్తు ఫీజు 120 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజు లేదు. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను రెండు దశల్లో ఎంపిక చేస్తారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూలు ఉంటాయి. ఏఈఈ ఉద్యోగాలకు పే స్కేలు రూ.57,100 నుంచి రూ.1.47 లక్షలు, ఏఈ జాబ్స్‌కు పే స్కేలు రూ.48,440 నుంచి రూ.1.37 లక్షలు, ఏటీవో పోస్టులకు పే స్కేలు రూ.37,640 నుంచి రూ.1.15 లక్షల దాకా(TTD Jobs) ఉంటుంది.
Also Read: Elon Musk – Gaza : ఆ ఆదాయమంతా గాజా, ఇజ్రాయెల్‌కు ఇచ్చేస్తా : మస్క్