TTD: 2026 జనవరి నెలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విడుదల చేయనున్న వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, గదుల కోటా వివరాలను ప్రకటించింది. భక్తులు ఆన్‌లైన్‌లో తమ దర్శనం, వసతిని ముందుగానే బుక్ చేసుకోవడానికి వీలుగా తేదీలను ఖరారు చేసింది.
ముఖ్యమైన విడుదల తేదీలు, సమయాలు
ఆర్జిత సేవా టికెట్లు & అంగప్రదక్షిణ టోకెన్లు: జనవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు (ఎలక్ట్రానిక్ డిప్ కోసం), అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను అక్టోబర్ 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
ఈ సేవా టికెట్ల కోసం భక్తులు అక్టోబర్ 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.
టికెట్లు పొందిన వారు అక్టోబర్ 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.
నాన్-డిప్ ఆర్జిత సేవా టికెట్ల విడుదల: కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను అక్టోబర్ 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది.
Also Read: Asia Cup 2025 Trophy: ప్రస్తుతం ఆసియా కప్ ట్రోఫీ ఎక్కడ ఉంది?
వర్చువల్ సేవల కోటా: వర్చువల్ సేవలు, వాటి అనుబంధ దర్శన స్లాట్‌లకు సంబంధించిన కోటాను అక్టోబర్ 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
శ్రీవాణి ట్రస్టు దర్శన కోటా: శ్రీవాణి ట్రస్టు ద్వారా దర్శన టికెట్ల కోటాను అక్టోబర్ 24న ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా: వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను అక్టోబర్ 24న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు (రూ. 300): ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల (ఎస్.ఇ.డి) కోటాను అక్టోబర్ 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
గదుల కోటా విడుదల: తిరుమల, తిరుపతిలలో గదుల వసతికి సంబంధించిన కోటాను అక్టోబర్ 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
భక్తులు ఈ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారిక వెబ్‌సైట్ అ7యిన https://ttdevasthanams.ap.gov.in ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, వసతిని బుక్ చేసుకోవాలని టీటీడీ ముఖ్య ప్రజా సంబంధా\ల అధికారి ఒక ప్రకటనలో కోరారు. జనవరి నెలలో రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులు ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు.