Site icon HashtagU Telugu

TTD: టీటీడీని పోలిన మరో నకిలీ వెబ్ సైట్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు

Tirumala Tirupati Devastanam Ttd

Tirumala Tirupati Devastanam Ttd

టీటీడీ (TTD) పేరుతో గల మరో నకిలీ వెబ్సైట్ (Fake Website)ని టీటీడీ ఐటీ విభాగం గుర్తించి తిరుమల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. FIR 19/2023 U/S 420, 468, 471 IPC ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి ఏపీ ఫోరెన్సిక్ సైబర్ సెల్ కు అప్పగించారు. ఈ మేరకు సైబర్ సెల్ అధికారులు నకిలీ వెబ్సైట్ పై విచారణ ప్రారంభించారు. ఇదివరకే 40 నకిలీ వెబ్ సైట్లపై కేసులు నమోదు చేశారు.

అధికారిక వెబ్ సైట్ https://tirupatibalaji.ap.gov.in ఇలా ఉండగా, చిన్న మార్పులతో కొందరు వ్యక్తులు రూపొందించిన https://tirupatibalaji-ap-gov.org వెబ్సైట్ ను టిటిడి గుర్తించింది. టీటీడీ అధికారిక వెబ్సైట్లోనే శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, గదులు బుక్ చేసుకోవాలని అధికారులు కోరడమైనది. దీంతో పాటు టీటీడీ అధికారిక మొబైల్ యాప్ ను TTDevasthanams కూడా వినియోగించవచ్చు.

Also Read: Covid Cases: భారత్ లో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. 67 వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య

తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు అన్నిరకాల టిక్కెట్లను ఆన్ లైన్ లోనే టీటీడీ కేటాయిస్తుంది. దీంతో టీటీడీని పోలిన నకిలీ వెబ్ సైట్లతో మోసగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ వెబ్ సైట్లపై టీటీడీ ఐటీ శాఖ గత కొంతకాలంగా జాగ్రత్తలు తీసుకుంటుంది. అయినా కూడా టీటీడీని పోలిన నకిలీ వెబ్ సైట్లు వస్తూనే ఉన్నాయి. దీనికి అడ్డుకట్ట వేయాలని టీటీడీ భక్తులు కోరుతున్నారు.