తిరుమల(Tirumala) నడక మార్గంలో చిరుత పులులు(Leopards) భక్తులని భయపడుతున్నాయి. చిరుత దాడిలో ఇటీవల ఒక చిన్నారి మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు మరో చిరుతని, ఎలుగుబంటిని నడక దారిలో గుర్తించారు. మరో నాలుగు చిరుతలు కూడా సంచరిస్తున్నాయని అనుమానిస్తున్నారు. దీంతో భక్తులు నడకదారిలో తిరుమలకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నేడు నూతన చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి(Bhumana Karunakar Reddy) ఆధ్వర్యంలో టీటీడీ(TTD) హైలెవెల్ కమిటీ మీటింగ్ జరిగింది.
తిరుపతి శ్రీ పద్మావతీ అతిథి గృహంలో టీటీడీ హై లెవల్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి మరియు పలువురు అధికారులు పాల్గొన్నారు. చిరుతల విషయం గురించి చర్చించి భక్తుల భద్రత కోసం పలు నిర్ణయాలు తీసుకున్నారు.
టీటీడీ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలు ఇవే..
#అలిపిరి, శ్రీవారి మెట్టు నడకమార్గాల్లో ఉదయం 5 నుండి మధ్యాహ్నం 2 వరకు మాత్రమే 12 ఏళ్ల లోపు చిన్న పిల్లలకు అనుమతి.
#మధ్యాహ్నం 2 గంటల తరవాత ఎటువంటి పరిస్టితుల్లో చిన్న పిల్లలను అనుమతించేది లేదు.
#నడకదారి భక్తులకు సేఫ్టీ కోసం ఊతకర్ర ఇవ్వాలని నిర్ణయం.
#ఘాట్ రోడ్డులో ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకే ద్విచక్రవాహనాలు అనుమతి. ఆ తర్వాత ద్విచక్ర వాహనాలకు కొండపైకి అనుమతి లేదు.
#భక్తుల రక్షణ కొరకు టీటీడీ ఖర్చుతో నిపుణులైన ఫారెస్ట్ సిబ్బందిని నియమించుకోవాలని నిర్ణయం.
#భక్తులు గుంపులు గుంపులుగానే వెళ్ళాలి.
#పెద్ద వాళ్ళను రాత్రి 10 వరకు అనుమతిస్తాం. ఆ తర్వాత కాలినడక మూసివేయబడుతుంది.
#నడక మార్గంలో భక్తులు జంతువులకు తినుబండారాలు ఇవ్వడం నిషేదం.
#జంతువులకు తినుబండారాలు అమ్మేవారిపై చర్యలు తీసుకుంటాం.
#అలిపిరి నుంచి తిరుమల వరకు 500 కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం.
#నడక మార్గంలో ఇరువైపులా ఫోకస్ లైట్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం.
#నడకమార్గంలో ఫెన్సింగ్ పై కేంద్ర అధ్యయన కమిటీ సలహా మేరకు నిర్ణయం.
#అలిపిరి, గాలి గోపురం, 7వ మైలు ప్రాంతాల్లో ప్రమాదాలపై భక్తులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో తెలిపారు.
Also Read : Leopard Attack in Tirumala : తిరుమల కాలి నడక..ప్రాణాలకే ముప్పా..?